నూనె అందుబాటులో లేనప్పుడు సాయిబాబా తన చావడిలో నీటితో దీపాలను వెలిగించాడని సాయి సత్‌చరిత్రలో మనం చదువుకున్నాం కదా. ఆ కాలంలోని వాళ్లు దానిని ప్రత్యక్షంగా చూసుండొచ్చు. కానీ, ఈ కాలంలో మనం ఎవరం కూడా అటువంటిదానిని చూడలేదు. అయితే, ఇలాంటి అద్భుతాన్ని చూడాలంటే మనం మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలోని నల్ఖేడా సమీపంలో కాళీసింధ్ అనే నది ఉంది. ఈ నది ఒడ్డున గడియాఘాట్ వలీ మాతాజీ ఆలయం ఉంది. ఈ ఆలయానికి ప్రతిరోజూ వందలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఈ ఆలయంలో నిత్యం ఓ అద్భుతం చోటు చేసుకుంటుంది. ప్రతిరోజూ సాయంత్రం సమయంలో అమ్మవారి ముందు ఓ దీపం వెలిగిస్తారు. ఈ దీపం మరుసటిరోజు సాయంత్రం వరకు వెలుగుతూనే ఉంటుంది.
Panchangam: ఈరోజు శుభముహూర్తాలు
ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా ఇక్కడే ఉంది అసలైన రహస్యం. అమ్మవారి ముందు వెలిగించే దీపంలో పోసేది నూనె కాదు..నీరు. ఈ నీటిని కాళీసింధ్ నది నుంచి తీసుకొస్తారు. ఇలా తీసుకొచ్చిన నీటిని అమ్మవారి ముందు ఉంచిన దీపం కుందిలో పోస్తారు. ఇలా పోసిన కాసేపటి తరువాత ఆ నీరు ఓ రకమైన జిగట పదార్థంగా మారుతుంది. ఆ తరువాత దీపం వెలిగిస్తే వెలుగుతుంది. ఇలా వెలిగిన దీపం ఆ ప్రమిదలోని నీరు మొత్తం ఆవిరయ్యే వరకు వెలుగుతుంది. ఇదెలా సాధ్యమన్నది శాస్త్రవేత్తలు కూడా గుర్తించలేకపోయారు. ఈ నీటితో మరోచోట దీపం వెలిగిస్తే వెలగదట. ఈ అమ్మవారి ఆలయంలో మాత్రమే దీపం వెలుగుతుంది. అయితే, వర్షాకాలంలో ఈ ఆలయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ దీపాన్ని వెలిగించరు. కారణం కాళీసింద్ నదిలోని నీరు ఆలయంలోకి ప్రవేశించడమే. నీటితో వెలిగే దీపాన్ని చూడాలంటే మనం తప్పకుండా మధ్యప్రదేశ్ వరకు వెళ్లి తీరాల్సిందే.