Native Async

పౌర్ణమి గరుడసేవకు ఏర్పాట్లు పూర్తి

Tirumala Pournami Garuda Seva 2025 Grand Arrangements by TTD, Thousands of Devotees Arrive for Lord Malayappa Swamy Procession
Spread the love

తిరుమలలో ప్రతి పౌర్ణమి రోజున గరుడ సేవను ఘనంగా నిర్వహిస్తుంటారు. కాగా, అక్టోబర్‌ 7వ తేదీన పౌర్ణమి తిథి కావడంతో గరుడ సేవను నిర్వహించేందుకు టీటీడీ దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారు సర్వాలంకార భూషితుడై గరుడ వాహనంపై మాడవీధుల్లో ఊరెరగనున్నారు. గరుడ వాహనంలో భక్తులను కటాక్షించేందుకు మాడవీధుల్లోకి వచ్చే స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఈ ఉదయం నుంచే మూలవిరాట్‌ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లో ఉన్నారు. ఉదయం మూలవిరాట్‌ను, రాత్రికి మలయప్ప స్వామిని దర్శించుకుంటే జన్మ తరిస్తుందని భక్తుల నమ్మకం.

రాశిఫలాలు – పూర్ణిమ రోజున ఈ రాశులవారిదే అదృష్టం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit