తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏడాది స్వామివారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తుంది. ప్రతి ఏడాది నిర్వహించే ఈ వైభవోపేతమైన బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. కాగా, ఈ ఏడాది నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సంబంధించిన తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. అదేవిధంగా సెప్టెంబర్ 16వ తేదీన స్వామివారి ఆలయంలో కోయిల్ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు తిరిగి సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 వరకు వాహన సేవలను నిర్వహిస్తారు. ఈ వాహన సేవల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
24/09/2025 – సాయంత్రం 05:43 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.
25/09/2025 – ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం
26/09/2025 – ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం
27/09/2025 – ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం,
మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం
28/09/2025 – ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి గరుడ వాహనం
29/09/2025 – ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం
30/09/2025 – ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం,
రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం
01/10/2025 – ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం
02/10/2025 – ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10 గంటల వరకు ధ్వజావరోహణం.
ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ దేవస్థానం కోరుతున్నది.