వైకుంఠద్వార దర్శనాలు విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన TTD చైర్మన్ BR నాయుడు

TTD Chairman BR Naidu Thanks Officials for Grand Success of Vaikuntha Dwara Darshanam

BR నాయుడు గారు ట్విట్టర్ ద్వారా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు ట్విట్టర్ ద్వారా అధికారులందరికీ దహన్యవాదాలు తెలిపారు… టీటీడీ చరిత్రలోనే కాక, ఎన్నడూ లేని విధంగా ఈసారి వైకుంఠద్వార దర్శనాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి అని తెలిపారు…

🔹 రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులకు వైకుంఠద్వార దర్శనం
🔹 టీటీడీ ఏర్పాట్లు, సదుపాయాలపై 93% భక్తులు సంతృప్తి
🔹 2024లో 6.83 లక్షలు, 2023లో 6.47 లక్షలతో పోలిస్తే భక్తుల సంఖ్యలో గణనీయ వృద్ధి
🔹 10 రోజుల్లో రూ.41 కోట్ల హుండీ ఆదాయం
🔹 44 లక్షల లడ్డూలు విక్రయం – గతేడాదితో పోలిస్తే 10 లక్షలు అధికం
🔹 గతేడాదికంటే 27% అధికంగా అన్నప్రసాదాల పంపిణీ
🔹 50 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల పండ్లు, 4 టన్నుల కట్ ఫ్లవర్స్‌తో అద్భుత అలంకరణలు
🔹 కళ్యాణకట్ట, పారిశుద్ధ్యం, వైద్య సేవల ఏర్పాట్లు భక్తులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచాయి
🔹 AI కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ
🔹 ప్రణాళికాబద్ధ క్యూలైన్ నిర్వహణతో అంచనాలకన్నా ఎక్కువ మందికి దర్శనం కల్పించగలిగాం

ఈ వైకుంఠద్వార దర్శనాలను శాంతియుతంగా విజయవంతం చేసిన భక్తులకూ, మెరుగైన సేవలు అందించిన అధికారులు, సిబ్బంది మరియు సేవకులకూ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *