పిల్లాపాపలతో ప్రతీ ఇల్లు కళకళలాడాలని మనం కోరుకుంటూ ఉంటాం. అయితే, చిన్నారులు ఉన్న కొందరి ఇళ్లలోనుంచి ఎప్పుడూ పిల్లల ఏడుపులు వినిపిస్తుంటాయి. ఇలా ఏడుస్తూ ఉంటే వైద్యుల దగ్గరికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తుంటాం. కానీ, ఎంత చేసినా కొందరు ఏడుపు మానరు. కారణం వారికి కొన్ని దోషాలు ఉండటమేనని జ్యోతిష్యనిపుణులు చెబుతున్నారు. నిరంతరం చిన్నారులు ఏడుస్తున్నారు అంటే వాతావరణం ప్రతికూలంగా మారుతుందని చెప్పడానికి సంకేతంగా చెబుతారు. దృష్టిదోషాల కారణంగా కూడా పిల్లలు ఏడుస్తుంటారు. ఇలా నిరంతరం పిల్లలు ఏడుస్తూ ఉంటే శాంతి పూజలు లేదా దోష నివారణ పూజలు చేయాలని జ్యోతిష్యనిపుణులు సూచిస్తున్నారు. దృష్టి దోషనివారణ కోసం నిమ్మకాయతలో దిష్టి తీయాలి.
ఏ దేవునికి ఎలాంటి బోట్టు పెట్టాలి?
ఉదయం సాయంత్రం వేళ దేవుడి గదిలో తప్పకుండా దీపాలు వెలిగించాలి. హనుమాన్ చాలీసా పఠించడం వలన దోషాలు తొలగిపోతాయి. దోషాలను అనుసరించి శాంతి పూజలు చేయించడం మంచిది. ఆడుకుంటున్న చిన్నారులు ఆకస్మికంగా ఏడవటం ప్రారంభిస్తే వాస్తు దోషాలు ఉన్నాయని అర్ధం చేసుకోవాలి. దీనికోసం శనిదేవతకు పూజించాలి. సూర్యాస్తమయ సమయంలో ఏడుపు ఎక్కువైతే ఇంట్లో దీపం వెలిగించి హనుమాన్ ఛాలీసాను పఠించాలి. నిద్రలో పిల్లలు పదేపదే ఏడుస్తున్నారు అంటే రాహుకేతు గ్రహాల దోషాలు ఉన్నాయని అర్థం. ఇంటిని గంగాజలంతో శుద్దిచేసి కుండలో కాసిన్ని నీళ్లు, బచ్చల ఆకులు వేసి దిష్టి తీయాలి. ఇలా చేయడం వలన దోషాలు తొలగిపోయి పిల్లలు ఏడపు ఆపుతారని పండితులు చెబుతున్నారు.