పూజా సమయంలో దేవుని ఫొటోలు లేదా విగ్రహాలకు బొట్టు పెట్టడం హిందూ ధర్మంలో విశేషంగా కనిపిస్తుంది. బొట్టు పెట్టడం భక్తికి, శ్రద్ధకు, ఆదరాభిమానాలకు సూచకంగా చెబుతారు. బొట్టు పెట్టడం ఎంత ముఖ్యమో, పెట్టిన విధానం కూడా అంతే ముఖ్యం. ఫొటోలకు మనం ఎంత గుండ్రంగా పెడుతున్నామన్నది మన భక్తిని, శ్రద్ధను తెలియజేస్తుంది. బొట్టు పెట్టడం గుండ్రంగా లేకుంటే దోషమా అంటే కాదని పండితులు చెబుతున్నారు. కానీ, మన శ్రద్ధకు అది చిహ్నంగా ఉంటుంది కాబట్టి వీలైనంత గుండ్రంగా ఉంచేలా చూడాలని పండితులు చెబుతున్నారు.
చలికాలంలో చర్మాన్ని ఎలా రక్షించుకోవాలి
గుండ్రని బొట్టు శాంతికి, సంపూర్ణతకు ప్రతీక. వైష్ణవు సంప్రదాయం, శైవ సంప్రదాయం, శాక్తేయ సంప్రదాయం అనుసరించి బొట్టు విధానాలుంటాయి. నిలువు, గుండ్రని, అడ్డబొట్టులు ఉంటాయి. దేవుని ఫొటోలకు బొట్టు రంగులు కూడా ముఖ్యమైనవే. శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవికి పసుపు, కుంకుమను కలిపి బొట్టుగా పెట్టాలి. మహాశివుడికి విభూతిని, శక్తి స్వరూణి అయిన అమ్మవారికి కుంకుమను అదీ ఎరుపు రంగులో ఉండే కుంకుమను పెట్టాలి. సుబ్రహ్మణ్యుడికి శుద్ద చందనాన్ని, హనుమంతుడికి కుంకుమ లేదా సుగంధ ద్రవ్యాలతో చేసిన పసుపును కాని బొట్టుగా పెట్టాలి. సింధూరాన్ని కూడా హనుమయ్యకు పెట్టవచ్చు. మనం దేవుని సేవలో ఉన్నాము అనే దానికి గుర్తుగా బొట్టు పెడతాము.