నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ గత వారం విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, అనేక అడ్డంకుల కారణంగా నిన్ననే థియేటర్లలో గ్రాండ్ ప్రీమియర్స్‌తో విడుదలైంది. వరుస వాయిదాల కారణంగా విడుదలకు ముందు అంచనాలు పెద్దగా లేవు. కానీ, విడుదలైన తర్వాత ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచేలా సినిమా బలమైన ఓపెనింగ్ సాధించింది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, అఖండ 2 మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఐతే ఇందాకే మేకర్స్ ఈ సినిమా ప్రీమియర్స్ కలిపితే మొత్తం వసూళ్లు రూ.50 కోట్ల మార్క్‌ను దాటేసింది అని ఆఫిసిఅల్ పోస్టర్ రిలీజ్ చేసారు… ఏకంగా 59 కోట్లు కల్లెక్ట్ చేసిందని అధికారికంగా ప్రకటించారు…
ప్రత్యేకంగా బి, సి సెంటర్లలో ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. బాలకృష్ణకు అక్కడ ఉన్న మాస్ ఇమేజ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద పనిచేసిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
మొదటి భాగంతో కొంచం స్టోరీ సమె అనిపించినా, కోర్ ఆడియన్స్‌తో అఖండ 2 బాగా కనెక్ట్ అవుతోంది. మాస్ ఎలివేషన్స్, భక్తి అంశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తున్నాయి.
ఇతర భాషల వెర్షన్ల నుంచి మాత్రం అంచనాల మేరకు వసూళ్లు రాలేదు. హిందీ మార్కెట్లో ప్రచారం చేసినప్పటికీ, ఇతర రాష్ట్రాల్లో ప్రమోషన్లు పరిమితంగా జరిగాయి. అయితే, సినిమాలోని హిందుత్వ భావజాలం రాబోయే రోజుల్లో ఉత్తర భారత ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉందని ట్రేడ్ భావిస్తోంది.
ఇక ముందున్న వీకెండ్ అఖండ 2కి కీలకంగా మారనుంది. ఈ వేగం కొనసాగితే, బాక్సాఫీస్ వద్ద మరింత బలమైన వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.