ఎన్ని సార్లు ప్రయత్నించినా అక్కినేని అఖిల్ పెద్ద సక్సెస్ కొట్టలేకపోయాడు… ఇక ఇప్పుడు కొత్త దర్శకుడు కిషోర్ అబ్బూరు తో కలిసి ఒక ఫామిలీ రురల్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు! ఈ సినిమా లో హీరోయిన్ భాగ్యశ్రీ… తనకి కూడా ఈ సినిమా ఇంపార్టెంట్ ఏ! విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా హిట్ కాకపోవడం తో లెనిన్ మీద చాల ఆశలే పెట్టుకుంది.
ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ అని చెప్పి, ఇందాకే సినిమా లోంచి ఫస్ట్ సింగల్, “వారేవా వారేవా…” లాంచ్ చేసారు.
ఈ లిరికల్ వీడియో లో భాగ్యశ్రీ ఇంకా అఖిల్ పూర్తి రురల్ backdrop లో బాగున్నారు… సాంగ్ కూడా మంచి డాన్స్ నెంబర్ కాబట్టి, శ్వేతా, జుబిన్ voices బాగా సెట్ అయ్యాయి. అలా రిలీజ్ అయిన వెంటనే ప్లేయలిస్ట్స్ లోకి ఎక్కేసింది!
ఇక స్టోరీ విషయానికి వస్తే, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పరువు హత్యల నేపధ్యం లో ఉంటుందంట… అలాగే ఈ సినిమా ని నాగార్జున తో కలిసి, నాగ వంశి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు!