సంక్రాంతి పండగ సందర్భంగా సినీ ఇండస్ట్రీని షేక్ చేసే భారీ అనౌన్స్మెంట్ వచ్చింది. అదే గత కొంతకాలంగా జరుగుతున్న అన్ని rumors కి తెరదించుతూ, పాన్-ఇండియా స్టార్ అల్లు అర్జున్, స్టార్ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి ఓ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లనుంది అని కూడా అనౌన్స్ చేసి, bunny ఫాన్స్ ని ఖుష్ చేసారు.
మైత్రి మూవీ మేకర్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ భారతీయ సినిమాకు కొత్త నిర్వచనం ఇవ్వబోతుందనే అంచనాలు ఉన్నాయి. ఇద్దరూ తమతమ రంగాల్లో క్రియేటివ్ జెయింట్స్‌గా గుర్తింపు పొందినవాళ్లు కావడంతో, వీరి కలయిక ఓ మర్చిపోలేని సినీ అనుభూతిని అందించనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ ప్రకటనతో పాటు విడుదలైన ఒక నిమిషం కాన్సెప్ట్ వీడియో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. అడవిని నేపథ్యంగా తీసుకుని రూపొందించిన యానిమేషన్ విజువల్స్‌లో అల్లు అర్జున్ మోషన్ పిక్చర్స్ తో పాటు, చాల అనిమల్స్ కనిపిస్తాయి. జస్ట్ ఒక లయన్ కింగ్ సినిమాలాగే ఉన్నాయ్ visuals . అనిరుధ్ రవిచందర్ అందించిన పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వీడియోకి మరింత ఎలివేషన్ ఇచ్చింది.
ముఖ్యంగా అడవంతా—సింహం, క్రూరమైన నక్కలు వంటి జంతువులు కూడా భయపడేలా ఒక వ్యక్తి గుర్రంపై దూసుకెళ్లే సీన్ ప్రేక్షకులకు అడ్రినలిన్ రష్ను అందిస్తోంది. ఈ అనౌన్స్మెంట్ వీడియోలోని పాటకు హైసెన్బర్గ్ లిరిక్స్ అందించగా, హెక్టర్ సలమాంకా వోకల్స్ ఇచ్చాడు. మొత్తం గ్లింప్స్ చాలా డిఫరెంట్‌గా ఉండటంతో, ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌పై హైప్ మరింత పెరిగింది.
ఇది అల్లు అర్జున్ కెరీర్లో 23వ సినిమా కాగా, లోకేష్ కనగరాజ్‌కు 7వ దర్శకత్వ చిత్రం. ఇద్దరూ తమ ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి చేసిన తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన తదుపరి పాన్-ఇండియా ప్రాజెక్ట్‌తో బిజీగా ఉండగా, లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ఓ సినిమాపై పని చేస్తున్నారు.
లోకేష్ కనగరాజ్ గత చిత్రం ‘కూలీ’ ఆశించిన స్థాయిలో మెప్పించకపోయినా, అల్లు అర్జున్‌తో ఆయన కలయికపై మాత్రం భారీ బజ్ నెలకొంది. ఈ కాంబినేషన్ నిజంగా భారతీయ సినిమా చరిత్రలో మరో భారీ మైలురాయిగా మారుతుందా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ ఉంది.