ఇంకొన్ని రోజుల్లో మెగా ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి అని తెలిసిందే కదా… అది కూడా మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ పెళ్లి కావడం తో ఇటు మెగా అటు అల్లు ఇంట సందడి వాతావరణం నెలకొంది… అలాగే మొన్నే శిరీష్ పెళ్లి ఫస్ట్ పత్రిక ను మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులకు అందించారు… ఇక నిన్న శిరీష్ తో సహా అల్లు అరవింద్ ఇంకా అయన భార్య ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ దంపతులకి ఇంకా MLC నాగ బాబు దంపతులకి కూడా వివాహ పత్రిక అందించి సాదరంగా ఆహ్వానించారు…
శిరీష్ ఈ న్యూస్ ని సోషల్ మీడియా లో షేర్ చేస్తూ, రెండు పిక్స్ కూడా షేర్ చేసి ఫాన్స్ ని ఖుష్ చేసాడు… అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనికా రెడ్డితో మార్చి 6న వివాహం చేసుకోనున్నారు. ఇదే తేదీన అల్లు అర్జున్ – స్నేహా రెడ్డి పెళ్లి జరిగిన విషయం విశేషం. వారు 2011 మార్చి 6న వివాహం చేసుకున్నారు.
2025 అక్టోబర్ 31న జరిగిన నిశ్చితార్థం తర్వాత దుబాయ్‌లో సముద్రం మీద ప్రత్యేక పార్టీ నిర్వహించారు. హైదరాబాద్‌లో హల్దీ ఈవెంట్, అల్లు అర్జున్ ఫార్మ్‌హౌస్‌లో కాక్‌టెయిల్ వేడుకలు కూడా జరిగాయి. ఇక మార్చి 6న హైదరాబాద్‌లో సంప్రదాయ పద్ధతిలో పెళ్లి వేడుక జరగనుంది.