సంక్రాంతి సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ సినిమా massive హిట్ అయితే, నెక్స్ట్ నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు సినిమా బ్లాక్బస్టర్ అయ్యింది… ఈ సినిమా టోటల్ ఎంటర్టైనింగ్ గా ఉండడం అలాగే నవీన్ స్టైల్ కామెడీ అందరికి బాగా నచ్చడం తో ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో మంచిగా రన్ అవుతుంది…
ఐతే కలెక్షన్స్ విషయానికి వస్తే, ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లో 100 కోట్ల కలెక్షన్ దాటేసింది! ఈ న్యూస్ ని నిర్మాతలు చాల స్పెషల్ గా సోషల్ మీడియా లో షేర్ చేస్తూ, తమ ఆనందాన్ని నెటిజన్స్ తో పంచుకున్నారు!
ఇక స్టోరీ విషయానికి వస్తే, నవీన్ ఒక పెద్ద జమీందార్ మనమడు… కానీ అతని వరకు వచ్చే సరికి ఏమి మిగలదు… సో, ఒక బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి మీనాక్షి ని ప్రేమిస్తాడు. మరి నవీన్ కి మీఁనాక్షి కి పెళ్లి అయ్యిందా, ఆ తరవాత జరిగిన స్టోరీ ఏంటా అని పెద్ద తెర మీదే చూడాలి!