సంక్రాంతి పండగ అనగానే మనకి ఆంధ్రప్రదేశ్ ఇంకా చెప్పాలంటే గోదావరి జిల్లాల హడావిడి తో పాటు సినిమాలు కూడా లైన్ లో ఉంటాయి కదా… ఐతే ఈసారి చాల పెద్ద పెద్ద సినిమాలు లైన్ లో ఉన్నాయ్ మరి. రేపే మన డార్లింగ్ రాజా సాబ్ సినిమా రిలీజ్… ఇంకో రెండు రోజుల్లో మెగాస్టార్ మన శంకర వర ప్రసాద్… ఇలా తరవాత నవీన్ పోలిశెట్టి ‘అనగనగ ఒక రాజు’ రిలీజ్ కి రెడీ గా ఉంది… అందుకే ఇందాకే ట్రైలర్ లాంచ్ కూడా జరిగింది…
మొదటినుంచీ ఈ సినిమా నవీన్ ది కాబట్టి, ఫుల్ కామెడీ తో ఉంటుంది అని ఎక్సపెక్టషన్స్ ఉన్నాయ్. ఇక ట్రైలర్ లో కూడా నాగార్జున వాయిస్ ఓవర్ తో, నవీన్ కి ఒక జమీందార్ మనవడిగా పరిచయం చేసి, పెళ్లి కోసం పిల్ల ని వెతుకుతూ ఉంటారు… అలా మీనాక్షి ని చూసి ప్రేమలో పడతాడు. మరి వాళ్ళ పెళ్లి జరిగిందా? మధ్యలో వచ్చిన ప్రాబ్లెమ్ ఏంటి అనేది మిగితా స్టోరీ.
ఈ సినిమాకి మారి దర్శకత్వం వహించగా, నాగ వంశి తన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించాడు. సో, అనగనగ ఒక రాజు సినిమా 14th జనవరి న రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది!