వెండితెరపై హృదయాలను తాకే ప్రేమకథలను అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్… ఇప్పుడు తన కెరీర్లో ఒక కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారని బాలీవుడ్ వర్గాల్లో బలమైన చర్చ జరుగుతోంది.
తాజా ఇండస్ట్రీ బజ్ ప్రకారం, ‘తేరే ఇష్క్ మే’ విజయం తరువాత ఆనంద్ ఎల్ రాయ్ ఒక పీరియడ్ యాక్షన్ రొమాన్స్ సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట. అందులో హీరోగా నటించబోయే అవకాశం కోలీవుడ్ హీరో ధనుష్ కి దక్కుతుందని అంటున్నారు.

ఇప్పటికే ఆనంద్ ఎల్ రాయ్ – ధనుష్ మూడు సినిమాల్లో కలిసి పని చేసారు. ‘రాంజానా’, ‘తేరే ఇష్క్ మే’ సినిమాలు ఈ జంటకు మంచి పేరు తీసుకురాగా, ‘అత్రంగి రే’ మాత్రం ఆ స్థాయి హిట్ కాలేదు. అయితే, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
ఇదిలా ఉంటే, ధనుష్ నటిస్తున్న 54వ చిత్రం, తాత్కాలికంగా D54 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ చిత్రం 2026 ఫిబ్రవరి లేదా మార్చిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.