ఈ మధ్య anchor, నటి అనసూయ చాల వివాదాల్లో చిక్కుకుంటుంది… మొన్నే కదా యాక్టరు శివాజీ దండోరా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో చేసిన వాఖ్యల పై అనసూయ ఫైర్ అయ్యింది… ఈ వివాదం చాల రోజులు కంటిన్యూ అయ్యింది.
ఇక ఇప్పుడు కొన్ని రోజుల కొండత జరిగిన TV షో లో నటి రాశి పై కించపరిచే వ్యాఖ్యలు చేసింది… సో, రాశి దాని గురించి మీడియా లో ఓపెన్ అప్ అవ్వడం వల్ల, అనసూయ బహిరంగంగా నోట్ రిలీజ్ చేసి క్షమాపణ చెప్పింది…
తన నోట్ లో ఇలా రాసుకొచ్చింది… “వెనక్కి వెళ్లి ఇప్పుడు దాన్ని సరిదిద్దలేను. కొన్నాళ్ల తర్వాత నాలో వచ్చిన మార్పును మీరు గమనించవచ్చు. మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి మాటలు గుర్తు చేస్తూ ద్వేషపూరిత ప్రచారం చేస్తున్నారు. నన్ను అవమానించడానికి ఉపయోగిస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను. నా బాధ్యతగా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెబుతున్నా’’.
సో, మొత్తానికి ఈ వివాదానికి ఇలా ఫుల్ స్టాప్ పడింది!