మెగాస్టార్ తో చేసిన మన శంకర వర ప్రసాద్ సినిమా హిట్ అయినప్పటి నుంచి అనిల్ నెక్స్ట్ సినిమా ఏంటి అని అందరు వెయిటింగ్… ఐతే అంతకు ముందు చెప్పినట్టు, కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని, సినిమా అనౌన్స్ చేస్తా అన్నాడు అనిల్. ఐతే అంతకుముందు అనిల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాడని అది కూడా దిల్ రాజు బ్యానర్ లో అని వార్తలు వచ్చాయి… కానీ అవన్నీ రుమౌర్స్ అని తేలిపోయింది…
అనిల్ రావిపూడి తన రీసెంట్ ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయట్లేదని చెప్పారు… “పవన్ కళ్యాణ్ గారిని నేరుగా కలవలేదు. ఆయనతో సినిమా చేయాలని ఉత్సాహంగా ఉంది. ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రెగ్యులర్ గా సినిమాలు చేసే స్టార్ కాదు కదా! ఆయనకు చాలా పనులు ఉన్నాయి. ఒకవేళ మా కాంబినేషన్ కుదిరితే సంతోషమే. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటివరకూ అయితే, ఎలాంటి ఆలోచనా లేదు”.
సో, ప్రస్తుతానికి అయన ఎవరితో సినిమా చేస్తారో తెలుసుకోవాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాలి!