బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్ డైరెక్టర్ అట్లీ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వినూత్నమైన టేకింగ్, ఎమోషన్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జోడించే తన శైలి ద్వారా కమర్షియల్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడిగా అట్లీ పేరు నిలిచిపోయింది. 2019లో విడుదలైన బిగిల్ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచి, అట్లీని ఇండియాలోనే టాప్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ జాబితాలో నిలబెట్టింది. షా రుఖ్ ఖాన్ తో జావా చేసాక, ఇంకా పాపులర్ అయ్యాడు ఈ డైరెక్టర్! ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తుండడం తో అట్లీ పేరు దేశవ్యాప్తంగా మరింత హాట్ టాపిక్‌గా మారింది.
జవాన్ సినిమాతో బాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు అట్లీ మరోసారి శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. అట్లీ ఇంకా ఆయన భార్య ప్రియా మోహన్ తమ రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు మంగళవారం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.
ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్‌లో, అట్లీ–ప్రియలతో పాటు వారి మూడేళ్ల కుమారుడు మీర్ కూడా కనిపించాడు. ప్రియా తన బేబీ బంప్‌ను చూపిస్తుండగా, చిన్న మీర్ తన కడుపుని ఆశ్చర్యంగా చూస్తూ అమాయకంగా ఫోజ్ ఇవ్వడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వెంటనే వైరల్‌గా మారింది.
ఇంకా కొన్ని పిక్స్ లో అట్లీ–ప్రియా జంట ప్రెగ్నన్సీ కపుల్ గోల్స్‌ను సెట్ చేస్తూ కనిపించారు. అలాగే, తమ ఐదు పెంపుడు జంతువులతో కలిసి తీసుకున్న ఒక ఫ్యామిలీ ఫోటోను కూడా షేర్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పోస్ట్‌కు వారు ఇచ్చిన క్యాప్షన్ కూడా అభిమానుల మనసులు గెలుచుకుంది. “మా ఇంట్లోకి మరో చిన్న సభ్యుడు రాబోతున్నాడు. అవును… మేము మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్నాం. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ప్రార్థనలు కావాలి” అంటూ అట్లీ, ప్రియా, మీర్‌తో పాటు తమ పెంపుడు జంతువుల పేర్లను కూడా క్యాప్షన్‌లో పేర్కొన్నారు.
గతంలో 2023 జనవరి 31న అట్లీ–ప్రియా తమ మొదటి బిడ్డ పుట్టిన విషయాన్ని ప్రకటించారు. అప్పట్లో అట్లీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌లో, “ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. మా చిన్నారి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. పేరెంట్హుడ్ అనే కొత్త ప్రయాణం ఈ రోజు మొదలైంది” అంటూ తన భావోద్వేగాలను వ్యక్తం చేశారు.