జక్కన్న అదే నండి మన SS రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాలా??? అవసరం లేదు కదా… ఒక మగధీర, ఈగ, బాహుబలి, RRR ఈ సినిమాలు చాలవు అయన పవర్ ఏంటో చెప్పడానికి???
ఇక ఈరోజే బాహుబలి ది ఎపిక్ సినిమా రి-రిలీజ్ అయినా సందర్బంగా మల్లి జక్కన్న తన మేజిక్ చూపించాడు అనిపించింది. నార్మల్ గా రి-రిలీజ్ అంటే జస్ట్ సినిమాలు మళ్ళి థియేటర్స్ లో మరొకసారి రిలీజ్ చేస్తారు. పాత సినిమాలైతే 4K వెర్షన్ లో మారుస్తారు. కానీ ఇక్కడ జక్కన బాహుబలి రెండు పార్ట్శ్ కలిపి, ఒకటే సినిమా గా మలిచి, కొత్త సీన్స్ ఆడ్ చేసి, తన మేజిక్ మళ్ళి చూపించాడు. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ స్పందన సాధించింది. ప్రేక్షకులు థియేటర్ బయట క్యూలైన్ లో నిలబడుతూ… స్క్రీన్ మీద బాహుబలి మాయ ని మళ్ళీ ఆస్వాదిస్తున్నారు. వీకెండ్ కి ఇక భారీ రష్ పక్కా! రీ-రిలీస్ లలోనే కాదు… మొత్తం విపరీతంగా కలెక్షన్లు కొట్టే అవకాశం కనిపిస్తోంది.
జక్కన్న రెండు పార్ట్ ల సినిమాలను ఒకే చిత్రంగా విడుదల చేసే కాన్సెప్ట్ కి కొత్త బాట వేసారు. ఇదే స్ట్రాటజీ ని పుష్పా, KGF లాంటి పాన్ ఇండియా మ్యాగ్నమ్ ఒపస్ లు కూడా ఫాలో అవ్వచ్చు.

నార్మల్ గా బాహుబలి ని మళ్ళీ రెండు పార్ట్స్ గా రీ-రిలీజ్ చేసి ఉంటే అంత మాయ రాకపోయేది. కారణం? ప్రజలు ఇప్పటికే టీవీ, OTT లలో ఎన్నోసార్లు చూశారు. కానీ ఒకే టికెట్… డబుల్ ధమాకా! ఆ ఐడియా మాత్రం ప్యూర్ జీనియస్.
అందుకే ఇప్పుడు ఈ వేవ్ బాలీవుడ్ వరకూ వెళ్లింది! హేరా ఫేరి, ఢూమ్, డాన్, హౌస్‌ఫుల్, స్ట్రీ, ఏక్ థా టైగర్, జోలీ LLB, సింఘమ్, భూల్ భులైయ్యా లాంటి big franchises కూడా ఇదే ఐడియా ని అమలు చేయాలని చూస్తున్నాయి.
అందుకే ఆయన ట్రెండ్ సెట్టర్ కాదు… ట్రెండ్స్ అంటే అదే అని చూపించే మాస్టర్! మీరేమంటారు???