నందమూరి బాలకృష్ణ లాస్ట్ సినిమా అఖండ 2 అంత పెద్ద హిట్ అవ్వలేదు… కలెక్షన్స్ బాగానే వచ్చాయి కానీ అనుకున్నంత పాన్ ఇండియా లెవెల్ లో ఆడలేదు. కానీ ఇప్పుడు మనం బాలయ్య నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించాలి… ఎవరు ఆ డైరెక్టర్???
బాలయ్య తన తదుపరి సినిమాను దర్శకుడు గోపిచంద్ మలినేనితో కలిసి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభమైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ సినిమా కోసం ముందుగా సిద్ధం చేసిన కథను పక్కనపెట్టి, గోపిచంద్ మలినేని పూర్తిగా కొత్త కథను రెడీ చేశారు అంట!

ఇటీవల ఆ కథను బాలకృష్ణకు వినిపించగా, ఆయన కథపై పూర్తిగా ఇంప్రెస్ అయ్యారని సమాచారం. కథ కొత్తదైనప్పటికీ, దాని స్కేల్, నేరేషన్, విజన్ అన్నీ కూడా ఊహలకు అందని స్థాయిలో ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు పవర్‌ఫుల్ కంటెంట్ ఉండబోతుందని టాక్.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను రామ్ చరణ్‌తో ‘పెద్ది’ మూవీని నిర్మిస్తున్న వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో, గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట.
ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, బాలకృష్ణ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే టీమ్ త్వరలోనే షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో ఉందని సమాచారం. బాలయ్య – గోపిచంద్ మలినేని కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.