మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’… ఈ సినిమా తో మరోసారి ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయగా, ఇప్పుడు తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది.
ట్రైలర్ లోకి వెళ్తే, రవి తేజ… అతను Dimple Hayathi ని ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటాడు… అంత బాగానే ఉంది… కానీ సడన్ గా మధ్యలోకి ఆషిక వస్తుంది. తనతో కూడా ప్రేమలో పడతాడు… మరి Dimple Hayathi పరిస్థితి ఏంటి, ఎందుకు ఇద్దరితో ఉంటాడు అన్నదే స్టోరీ!
సాధారణంగా ఈ తరహా కథలు మెలోడ్రామాటిక్‌గా మారే అవకాశం ఉన్నా, దర్శకుడు కిషోర్ తిరుమల తన ప్రత్యేక శైలిలో హ్యూమర్‌కి, డ్రామా కి equal importance ఇచ్చారు.
రవితేజ ఈ ఫ్యామిలీ మం పాత్రలో సునాయాసంగా ఇమిడిపోయారు. ఆయన స్వాగ్, ఎలిగెన్స్, టైమింగ్ అన్నీ సరైన నోట్స్‌ను తాకాయి. డింపుల్ పాత్ర homely గా ఉండగా, ఆషికా పాత్ర మోడరన్ గా ఉంది. ఈ ముగ్గురి మధ్య ఉన్న ట్రైయాంగ్యులర్ డైనమిక్స్ సినిమాకు మంచి బలంగా నిలుస్తాయి.
ఇక సత్య, సునీల్, వెన్నెల కిశోర్, మురళీధర్ గౌడ్ తమ కామెడీతో సినిమాకు మరింత ఎంటర్టైన్మెంట్ జోడించారు. వారి ప్రతి సీన్ నవ్వులు పూయిస్తుంది. ఈ సినిమా సంక్రాంతి పండగ సందర్బంగా 13th జనవరి న రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది!