తెలుగు ప్రేక్షకులు ఎంతో ఇష్టపడే షో బిగ్ బాస్ అని అందరికి తెలుసు కదా… అలానే వీకెండ్ ఎపిసోడ్స్ అంటే KING NAGARJUNA వచ్చి మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఒక బూస్ట్ ఇచ్చి వెళ్తాడు. అలానే, నిన్న కూడా saturday ఎపిసోడ్ లో గత వారం జరిగిన తప్పులు చెప్పి, కంటెస్టెంట్స్ ని కోప్పడి, ఇంకా డెమోన్ పవన్ కెప్టెన్సీ ని రద్దు చేసి మరి, సూపర్ అనిపించాడు. ఇక నిన్న జరిగిన ఇంకో ట్విస్ట్ ఇప్పటి వరకు ఓనర్స్ గా ఉన్న వాళ్ళు టెనెంట్స్ గా మర్చి, టెనెంట్స్ ని ఓనర్స్ గా చేసాడు. ఇది సూపర్ అసలా ఎందుకు అంటే, షో చూసే వాళ్ళకి కామనర్స్ బిహేవియర్ కొంచం ఓవర్ గా అనిపించింది.
అందుకే ఇప్పుడు అసలు ఆట మొదలవుతుంది… ఈరోజు సండే కాబట్టి, ఆల్రెడీ మనం ప్రోమో లో చుసిన విదంగా, రెండు గ్రూప్స్ కి పాటల పోటీ పెట్టి ఎంటర్టైన్ చేసాడు కింగ్. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది, ఈ వారము ఎవరు ఇంటి నుంచి బయటికి వెళ్తారు అని…
లాస్ట్ వీక్ శ్రష్టి వర్మ వెళ్లగా, ఈ సారి నామినేషన్స్ లో మాక్స్ అందరు కామనర్స్ ఉన్నారు… సో, ఓటింగ్ కి వచ్చేసరికి సెలబ్రిటీస్ లో సుమన్ శెట్టి, భరణి కి ఓట్లు బాగా పడ్డాయి, వాళ్ళు టాప్ లోనే ఉన్నారు… కానీ ఫ్లోరా శైనీ కి కొంచం తక్కువ ఓట్లు పడడం వల్ల డేంజర్ జోన్ లోనే ఉంది…
ఇక హరిత హరీష్ కి ఎక్కువ నామినేషన్స్ పడినా కానీ, ఓట్లు పడుతున్నాయి కాబట్టి సేఫ్. ఇక మిగిలింది మర్యాద మనీష్, ప్రియా శెట్టి, డీమాన్ పవన్… పవన్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి సేఫ్ పైగా రైతు తో లవ్ మేటర్ తో కూడా ట్రేండింగ్ లో ఉన్నాడు. సో అతను ఇప్పుడే పోడు. సో, మిగిలింది మనీష్, ప్రియా… ఇద్దరికీ తక్కువ ఓట్లు పడ్డాయి… పైగా ఫ్లోరా కూడా అదే జోన్ లో ఉంది. సో, కొందరు ఈవారం డబల్ ఎలిమినేషన్ ఉంటుంది… దాంట్లో మనీష్, ఫ్లోరా వెళ్ళిపోతారు అని, కొందరేమో ప్రియా వెళ్ళిపోతుందని అంటున్నారు. చూద్దాం… ఎం జరుగుతుందో…