పవన్ కళ్యాణ్ ఒక ఋషి – బాబీ

Director Bobby Calls Pawan Kalyan “A Rishi” – Viral Post Sparks New Film Speculation

పవన్ కళ్యాణ్… మనకి పవర్ స్టార్ కావచ్చు… కానీ ఇప్పుడు అయన AP లో చాల మందికి దేవుడు… ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ CM అయిన తరవాత అయన చేసే సేవలు, కార్యక్రమాలు అన్ని అయన ఎంత గొప్పవాడో చెప్పకనే చెపుతున్నాయి… అలానే చాల మంది డైరెక్టర్స్ కి కూడా అయన అంటే చాల చాల ఇష్టం… తాజాగా మెగాస్టార్ తో వాల్తేర్ వీరయ్య సినిమా చేసిన బాబీ కొల్లి కూడా మరో సారి పవన్ కళ్యాణ్ మీద తన అభిమానాన్ని చాటుకున్నారు…

సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ తో ఉన్న పిక్ ని యాడ్ చేసి ఒక మంచి పోస్ట్ ని నెటిజన్స్ తో పంచుకున్నాడు…

ఆ పోస్ట్ లో ఏముందంటే… “ఆయన్ని కలవడానికి వెళుతున్నప్పుడు నాలో చిన్న ఉద్వేగం… ఆయనతో పనిచేసిన టైములో అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి. కానీ ఇప్పుడు…ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను వెళ్ళేసరికి చిరునవ్వులు చిందిస్తున్న ఒక ఋషి లా కనిపించారు… రాజకీయాల్లో తమ ఆస్తుల్ని పెంచుకున్న వ్యక్తుల గురించి విన్నాం, చూసాం… కానీ అన్ని సౌకర్యాలని వొదులుకొని నమ్మిన సిద్ధాంతం కోసం బతుకుతున్న ఆయన నాకు ఒక శిఖరం లా కనిపించారు. అక్కడ ఉన్నంత సేపూ ఆయన నాపై చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయాను. చివరగా ఒక్క మాట చెబుతున్నాను… జ్ఞానం కోసం రాజభోగాలు వదిలేసి అడవులు పట్టిన బుద్ధుడిని మనం చరిత్రలో చదువుకున్నాం… జనం కోసం తన సుఖాలన్నీ వదులుకొని నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగిని ఇవాళ చూశాను… జైహింద్… Love you always my POWER STAR @PawanKalyan.”

అలాగే ఈ పోస్ట్ తో అభిమానుల్లో ఒక కొత్త ఆశ చిఱురించింది… బాబీ ఎమన్నా పవర్ స్టార్ కి కొత్త కథ చెప్పారా??? వీరిద్దరి సినిమా ఎమన్నా రాబోతోందా అన్న డౌట్ కూడా వచ్చింది… చూద్దాం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *