ఇప్పుడంతా యంగ్ హీరోస్ కాలం నడుస్తుంది… ఇక మన శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక సినిమా ‘ఛాంపియన్’ కూడా ఈ నెల లోనే అది కూడా క్రిస్మస్ కానుకగా 25th న రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అందుకే ప్రమోషన్స్ కూడా బాగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా లో ఫస్ట్ పాట “గిరా గిరా…” ఇప్పటికే సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది. ఇక ఇప్పుడు సెకండ్ సాంగ్, “సల్లంగుండాలె…” కూడా రిలీజ్ అయ్యింది ఇందాకే…
ఈ పాట చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరగక మానదు… ఊరి జనాలంతా ఊరి కోసం పోరాడుతుంటే, మధ్యలో నిశ్చయమైన పెళ్లి కూడా చేయాల్సి వస్తుంది… కానీ ఆ తండ్రి కళ్యాణ్ చక్రవర్తి, తల్లి అర్చన లు తమ కూతురు కోసం పెళ్లి ఆపకూడదు అని నిశ్చయించుకుంటారు… అలానే ఊరి జనమంతా ఒక్కక్కొరు ఒక్కో పని చేస్తూ, ఆ కుటుంబానికి సహాయపడడం సూపర్. అలానే ఈ సాంగ్ లో పల్లెటూరి పెళ్లి కార్యక్రమాలు కూడా ఎంతో చక్కగా చూపించారు…
రోషన్ డాన్స్ ఇంకా అనన్స్వర డాన్స్ కూడా అద్భుతంగా ఉంది… అందరు ఒక్క మాట మీద ఊరి కోసం చేసే పోరాటమే ఛాంపియన్ సినిమా…
ఈ సినిమా లో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి కీలక పాత్రలో నటిస్తున్నారు. డిసెంబర్ 25 క్రిస్మస్ రిలీజ్ కోసం పూర్తి రెడీ అయినా ఈ సినిమా, ప్రమోషన్స్ విషయంలో మాత్రం టీమ్ అసలు వెనక్కి తగ్గడం లేదు… ఒక్కో రోజూ ఒక కొత్త అప్‌డేట్‌తో ప్రేక్షకుల్లో హైప్ పెంచేస్తున్నారు.
లేటెస్ట్ గా మిక్కీ జె మెయర్ మెలోడియస్ సంగీతంతో ‘సల్లంగుందలే’ పాట కూడా హైప్ పెంచేసింది.
చంద్రబోస్ సాహిత్యం కూడా పెళ్లి ఇంట్లో జరిగే చిన్న చిన్న హడావిడి, నవ్వులు, అప్పగింతలు టైం లో కళ్ళు తడిచే క్షణాలు… అన్నీ ఒక్కో మాటలో చెప్పేసాడు.
అందుకే ఇప్పటి నుంచి ‘సల్లంగుందలే’— ఈ సీజన్‌లో ప్రతి పెళ్లింట్లో వినిపించే కొత్త వెడ్డింగ్ ఆంథమ్ అవడం ఖాయం!