గద్దర్ అవార్డ్స్ 2025 : మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవం…

Chiranjeevi Honored with NTR National Film Award at Gaddar Telangana Film Awards 2025

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నటుడు అంటే ఫస్ట్ మనకి గుర్తుకు వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. అందుకే అంతటి లెజెండరు నటుడికి ఈరోజు ఆయనకి గద్దర్ అవార్డ్స్ 2025లో ప్రతిష్టాత్మకమైన NTR National Film Award ప్రకటించారు. దశాబ్దాలుగా సినీ రంగానికి ఆయన అందించిన అపూర్వ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆయన సినీ ప్రయాణం ఇప్పటికీ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన Gaddar Telangana Film Awards 2025లో లెజెండరీ కళాకారులతో పాటు ప్రస్తుతం సినీ రంగంలో ప్రతిభ కనబరుస్తున్న వారికి కూడా అవార్డులు ప్రకటించారు. ఇందులో ప్రత్యేక గౌరవంగా చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు అందించారు.

ఈ అవార్డు మహానటుడు N. T. Rama Rao గారి పేరు మీద ఏర్పాటైంది. సినీ రంగంలో మాత్రమే కాదు, భారతీయ సినిమాను ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన వ్యక్తులకు ఈ పురస్కారం ఇస్తారు.

చిరంజీవి తన కెరీర్‌లో మొత్తం తొమ్మిది Filmfare Awards South అవార్డులు, మూడు నంది అవార్డులు అందుకున్నారు. అలాగే భారత ప్రభుత్వం నుంచి 2006లో పద్మ భూషణ్, 2024లో పద్మ విభూషణ్ పురస్కారాలు కూడా అందుకున్నారు.

ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న భారీ చిత్రం Vishwambhara విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *