మెగాస్టార్ చిరంజీవి తాజా బ్లాక్బస్టర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఘన విజయం తో చిరు ఐస్ బ్యాక్ అని మళ్ళి నిరూపించి ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు మన మెగాస్టార్. అలాగే ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో తన ఫామిలీ తో ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడే మన CM రేవంత్ రెడ్డి ని కూడా దావోస్ లో కలిసాడు!
ఐతే ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు సోషల్ మీడియా ద్వారా ఒక థాంక్ యు నోట్ పోస్ట్ చేసాడు మన మెగాస్టార్… దశాబ్దాల పాటు కొనసాగుతున్న తన సినీ ప్రయాణానికి ప్రేక్షకుల ప్రేమే ప్రధాన శక్తి అని ఆయన స్పష్టం చేశారు.
అయన పోస్ట్ లో ఏముందంటే, “’మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంకి ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ మరియు అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞత భావనతో నిండిపోతోంది.
నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒక్కటే – నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేను. ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు.
ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, నా ప్రాణసమానమైన అభిమానులది, నా డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతీ ఒక్కరిది మరియు ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెంట నిలబడి ఉన్నవారందరిది.
వెండితెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే నా శక్తి. రికార్డులు వస్తుంటాయి – పోతుంటాయి, కానీ మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం.
ఈ బ్లాక్బస్టర్ విజయం వెనుక ఎంతో కృషి చేసిన మా దర్శకుడు HIT MACHINE
అనిల్ రావిపూడికి, నిర్మాతలు సాహు & సుస్మితలకు, అలాగే మొత్తం టీమ్ అందరికీ, నాపై మీరందరూ చూపిన అచంచలమైన నమ్మకానికి ధన్యవాదాలు..
ఈ సంబరాన్ని అలాగే కొనసాగిద్దాం. మీ అందరికీ ప్రేమతో… లవ్ యూ ఆల్
మీ చిరంజీవి” అని పోస్ట్ చేసి, మళ్ళి ఒకసారి తన ఫాన్స్ హృదయాలను తాకాడు!
అలాగే, MSG విజయం వెనుక ఉన్న సృజనాత్మక బృందానికి కూడా చిరంజీవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత చిరంజీవి కష్టాన్ని ప్రశంసిస్తూ, ఒక బ్లాక్బస్టర్ విజయం ఎప్పుడూ ఒక వ్యక్తిదే కాదు… అది సమిష్టి విజయం అనే విషయాన్ని గుర్తు చేశారు. చిరంజీవి వినయం, సహకార భావం మరోసారి పరిశ్రమకు ఆదర్శంగా నిలిచింది.
నెక్స్ట్ మన చిరు బాబీ దర్శకత్వం లో ఒక యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నాడు… ఫిబ్రవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి, మళ్ళి సంక్రాంతికి బరిలో ఉంటానని చెప్పాడు కూడా!