నిన్న రాత్రి జరిగిన మన శంకర వర ప్రసాద్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో అందరు చాల బాగా ఎంజాయ్ చేసారు… ఇటు హీరోస్ వెంకీ, మెగాస్టార్ తో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఎంతో ఆనందంగా స్టేజి మీద స్టెప్స్ కూడా వేశారు. అందరు ఎంతో చక్కగా ఆడియన్సు ని ఎంటర్టైన్ చేసి, సినిమా మీద చాల అంచనాలు పెంచేశారు… అలాగే మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, అనిల్ రావిపూడి, వెంకటేష్ గురించి చాల చెప్పారు…
ఆ విశేషాలేంటో అయన మాటల్లోనే తెలుసుకోండి…‘‘ఈ సంక్రాంతి ‘మన శంకరవరప్రసాద్ గారు’ది మాత్రమే కాదు. తెలుగు సినీ పరిశ్రమ మొత్తానిది కావాలి. ప్రభాస్, రవితేజ, శర్వా, నవీన్ పొలిశెట్టి అన్ని సినిమాలు హిట్ కావాలి. ఆ విజయాలను మీరు (ప్రేక్షకులు) ఇచ్చి తీరతారని కోరుతున్నా. 2026 సంక్రాంతికి అన్నీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు వస్తున్నాయి.
అనిల్ రావిపూడితో సినిమా చేస్తే వేరే లెవల్‌లో ఉంటుందని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అన్నారు. ఆయన చేతుల మీదుగానే ఈ సినిమా మొదలైంది. అనిల్ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. కామెడీతో పాటు, హృదయానికి హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయి. వైవిధ్యంగా ఈ సినిమాను చేద్దామని నేను చెప్పాను. కానీ, అందుకు అనిల్ ఒప్పుకోలేదు. నా గత సినిమాల్లోని పాత్రలన్నీ ఒక క్యాప్సుల్స్‌లా చేసి, తన ఫోన్‌లో పెట్టుకున్నారు. ఈ సినిమాలో సన్నివేశానికి తగినట్లు వాటిని చేయమని చెప్పారు. వాటిని ఎంజాయ్ చేస్తూ చేశాను. షూటింగ్ చివరి రోజు చాలా ఎమోషనల్ అయ్యాను. అంతకుముందు ఎప్పుడూ అలా కాలేదు. షూటింగ్ ఒక పిక్నిక్‌లా జరిగేది. ఈ మధ్య కాలంలో ఇంత సరదాగా షూటింగ్ జరగలేదు. బడ్జెట్ పరంగా ఇది సూపర్‌హిట్ అయింది. అనుకున్న సమయానికి పూర్తి చేశారు. జనవరి 12న మరోసారి విజయాన్ని ప్రేక్షకులు నిర్ణయిస్తారు.
వెంకటేశ్‌తో కలిసి పనిచేస్తే సమయం తెలియదు. జీవిత పరమావధి గురించి ఆయన చెబుతుంటే.. మోడ్రన్ గురువులా అనిపిస్తారు. సినిమా, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తారు. లాస్ ఏంజిల్స్‌లో నేనూ వెంకటేశ్ కలిసి ఫొటో దిగాం. అప్పటి నుంచి ఆయనతో సినిమా చేయాలని అనిపించేది. అది దీంతో నిజమైంది. థియేటర్‌లో మా కాంబో ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ మరోస్థాయికి వెళ్తుంది. మా ఇద్దరి కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తాం. అందుకు తగిన కథ అనిల్ రావిపూడి రాసుకో. నయనతార కుటుంబ సభ్యురాలిలా కలిసిపోయింది. ఆమె విషయంలో అనిల్ రావిపూడి మ్యాజిక్ చేశాడు. ఇక సినిమా తీయడమే కాదు, దాన్ని ఎడిటింగ్ విషయంలోనూ అనిల్ ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. సినిమాను ఎంతగా ప్రేమిస్తాడో, అనవసర సన్నివేశం వస్తే, నిర్దాక్షణ్యంగా తీసేస్తాడు’’ అని చిరు తన స్పీచ్ ని ముగించాడు…