కపుల్ ఫ్రెండ్లీ వచ్చేది వాలెంటైన్స్ డే కే…

Santosh Sobhan’s Couple Friendly Locks Valentine’s Day Release Date

సంతోష్ శోభన్, మానస వరణాసి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా విడుదల తేదీ లాక్ అయ్యింది. ఈ సినిమా ఫిబ్రవరి 14 – వాలెంటైన్స్ డే రోజున థియేటర్లలోకి రానుంది. చెన్నై నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం యువతను ఆకట్టుకునే ప్రేమకథతో పాటు మంచి సాంగ్స్ ని అందించనుందని మేకర్స్ చెబుతున్నారు.

ఈ రోజు సినిమా బృందం రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తూ, హీరోహీరోయిన్లు కనిపించే ప్రోమోషనల్ వీడియోతో పాటు ఒక ఆకర్షణీయమైన పోస్టర్ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్, వీడియోల ద్వారా సినిమాకు సంబంధించిన టోన్, జంట మధ్య కెమిస్ట్రీపై ఒక క్లారిటీ వస్తోంది.

ఇటీవల బాక్సాఫీస్ వద్ద కాస్త కష్టమైన దశను ఎదుర్కొన్న సంతోష్ శోభన్… ఈసారి పూర్తిగా క్లీన్, పాజిటివ్ రొమాంటిక్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాపై ఆయనతో పాటు మేకర్స్ కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *