Native Async

ఇయర్ ఎండింగ్ లో భారీ సినిమాలు – భారీ కలెక్షన్స్…

December Box Office Magic Continues: Dhurandhar Scores Big, Akhanda 2 Gears Up Next
Spread the love

డిసెంబర్ అంటే సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడూ ఒక మంచి రాబడి వచ్చే నెల. సెలవులు ఎక్కువగా ఉండటం, కుటుంబ ప్రేక్షకులు థియేటర్ల వైపు మొగ్గు చూపటం, పెద్ద సినిమాలు వరుసగా విడుదల కావడం—ఇలా అనేక కారణాలు ఈ నెలను ప్రత్యేకంగా నిలబెడతాయి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ తిరిగి పెరగడంతో, డిసెంబర్ నెల ప్రతి సంవత్సరం కనీసం ఒక భారీ బ్లాక్‌బస్టర్‌ను అందించే ‘విన్నింగ్ సీజన్’గా మారింది. ఆ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 2025 డిసెంబర్ కూడా దీనికి మినహాయింపు కాలేదు.

ఇప్పటికే రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ డిసెంబర్ మొదటి శుక్రవారం రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలకు ముందే వివాదాలు, కోర్టు కేసులు, సెన్సార్ ఇష్యూలను ఎదుర్కొన్నా కూడా, సినిమా కంటెంటు బలంగా ఉండటంతో ప్రేక్షకుల మనసు దోచింది . ఫస్ట్ డే ఓపెనింగ్స్ సాధారణంగా ఉన్నా, రెండో రోజు నుంచే కలెక్షన్లు గణనీయంగా పెరిగి ఇప్పుడెల్లా 180 కోట్ల మార్క్ దాటేసింది. ఈ వేగంతో డిసెంబర్ 2025 తొలి బ్లాక్‌బస్టర్‌గా ధురంధర్ పేరు ఖరారైంది.

అయితే ఇదే రోజున రావాల్సిన మరో భారీ సినిమా అఖండ 2 అయితే ఫైనాన్షియల్ ఇష్యూల కారణంగా వాయిదా పడింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌కు సంబంధించి పెండింగ్ డ్యూస్ క్లియర్ కాకపోవడంతో విడుదలను ఒక వారం వెనక్కి మార్చాల్సి వచ్చింది. ఈ అన్‌ప్లాన్డ్ వాయిదా మొదట అభిమానులను నిరాశపరచినా, అవే రోజుల్లో సోషల్ మీడియాలో అఖండ 2 చుట్టూ పెద్ద చర్చ మొదలైంది. రోజుకొక రూమర్, రోజుకొక కోర్టు అప్డేట్… ఇలా ఒక్క వారం రోజుల్లో సినిమాపై హైప్ రెట్టింపు అయ్యింది. విడుదల వాయిదా పడటం వల్లే అఖండ 2కి వచ్చిన ఉచిత ప్రచారం, అసలు డిసెంబర్ 5న రిలీజ్ అయితే ఉండేదానికంటే చాలా ఎక్కువైంది.

అలాగే, గత కొన్నేళ్లలో కూడా డిసెంబర్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి అదృష్టం తీసుకొచ్చింది. 2021లో పుష్ప మరియు అఖండ కలిసి బాక్సాఫీస్‌ను ఊపేసాయి. 2022 పెద్దగా సీజన్ కాకపోయినా, 2023లో అనిమల్ మరియు సలార్ సునామీ రేపాయి. ఆ వెంటనే 2024లో పుష్ప 2 తుఫాను చూపించింది. ఈ క్రమంలో 2025లో మొదటి విజయాన్ని ధురంధర్ అందించగా, ఇప్పుడు మరొక భారీ విజయాన్ని అందించాలనే బాధ్యత అఖండ 2 మీద పడింది.

ఇప్పటికే అఖండ 2 పేడ్ ప్రీమియర్లకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. టికెట్ ధరల పెంపుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో, బుకింగ్స్ ఏకంగా కొత్త రికార్డులను చూపుతున్నాయి. USAలో 250K$ అడ్వాన్స్ సేల్స్ నమోదుకాగా, హైదరాబాద్‌లో డే 1 బుకింగ్స్ 3 కోట్ల మార్క్‌ను అందుకున్నాయి. నిజంగా చెప్పాలంటే, డిసెంబర్ 5 విడుదల కోసం వచ్చిన రెస్పాన్స్ కంటే ఇప్పుడు ఉన్న రెస్పాన్స్ మూడు రెట్లు ఎక్కువగా కనిపిస్తోంది.

ఇప్పుడు ప్రశ్న ఒక్కటే… అఖండ 2 కథ, మాస్ ఎనర్జీ, బోయపాటి శ్రీను మైండ్-బ్లోయింగ్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను మెప్పిస్తాయా? బాలయ్య మరోసారి అఘోర అవతారంలో బాక్సాఫీస్‌ను కుదిపేస్తారా? ధురంధర్ తెచ్చిన మొదటి బ్లాక్‌బస్టర్ శుభారంభాన్ని కొనసాగిస్తూ అఖండ 2 డిసెంబర్‌ను ఇంకా పెద్దదిగా మార్చుతుందా?

ఇక్కడ ఇంకా రోషన్ మేక ఛాంపియన్ క్రిస్మస్ ఇంకా రోషన్ కనకాల మౌగ్లీ సినిమా కూడా రేస్ లో ఉన్నాయ్… రెండు మంచి సినిమాలు, టీజర్, ట్రైలర్స్ బాగున్నాయి కాబట్టి, అనూహ్యంగా హిట్ అయినా అవ్వచ్చు!

సో, డిసెంబర్ ఇంకా నడుస్తుంది… ఎన్ని హిట్ సినిమాలు వస్తాయో, వెయిట్ అండ్ వాచ్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit