“చిన్నారి తల్లి… చిన్నారి తల్లి…” అని మన ముద్దుల కూతురు కోసం పాటలు పాడుకుంటం కదా… మరి అంత ముద్దు గా ఉంది బాలీవుడ్ జోడి రణ్వీర్ దీపికా ల చిట్టి తల్లి! ఈ గారాల పట్టి పుట్టినప్పటి నుంచి తన ఫోటో రివీల్ చేయలేదు… కానీ నిన్న దీపావళి సందర్బంగా దీపికా రణ్వీర్ లు ఇంస్టాగ్రామ్ లో తమ బుజ్జి తల్లి పిక్స్ షేర్ చేసారు… కొందరేమో రణ్వీర్ లా ఉందంటూ, లేదు లేదు కొండెరేమో అచ్చు దీపికా నే అంటున్నారు…
మరి మీరు చిన్నారి ‘Dua ‘ ని చూసి ఎవరి లా ఉందొ చెప్పండి…





సెప్టెంబర్ 8న పుట్టిన తమ పాపకు ‘దువా పదుకోన్ సింగ్’ అని పేరు పెట్టిన ఈ స్టార్ కపుల్, మొదట మీడియా, పాపరాజీలను కొంత గ్యాప్ ఇవ్వమని కోరారు. కానీ ఈ దీపావళి వేళ, పసిపాపతో కలిసి ఉన్న ఆ ఆనంద క్షణాన్ని పంచుకోవకుండా ఉండలేకపోయారు.
సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఆ ఫోటోలో దీపికా, రణవీర్, చిన్నారి దువా – ముగ్గురూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. దీపికా చేతుల్లో పసిపాపను ఆప్యాయంగా పట్టుకున్న రణవీర్ చూపులు ప్రేమతో నిండిపోయాయి. ఆ ఫోటో చూసిన అభిమానులందరూ ఎమోషనల్ అయ్యారు. “ఇంత అందమైన కుటుంబం… ఈ దివాళి నిజంగా బంగారమైంది” అని కామెంట్లు చేస్తున్నారు.
ఒక సంవత్సరం తర్వాత బయటకొచ్చిన ఈ ఫ్యామిలీ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమ, ఆప్యాయం, ఆనందం కలగలిపిన ఆ ఫోటో దీపావళికి నిజమైన వెలుగునిచ్చింది అని అభిమానులు అంటున్నారు.