ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవం మంగళవారం రాత్రి వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా, భాజభజంత్రీల నడుమ జరిగింది. గర్భగుడిలో ఉన్న అమ్మవారికి పూజలు చేసిన అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వేద పండితుల మంత్రోచ్ఛరణలతో ఆలయ అనువంశిక పూజారి బంటుపల్లి వెంకటరావు స్వహస్తాలతో ఆలయం వెలుపలకు తీసుకొచ్చారు. ఆలయం బయటే ఆలయ అదికారులు ఏర్పాటు చేసిన ఉయ్యాల చుట్టూ ముమ్మారు ప్రదిక్షణలు చేసారు. అనంతపురం శ్రీశ్రీ శ్రీ పైడితల్లిని ఉయ్యాల లో కూర్చోబెట్టి… కాస్సేపు ఉయ్యాలను ఊపారు. ఈ కార్యక్రమం మొత్తం దేవాలయ ఆలయ ఈఓ శిరీష ఆధ్వర్యంలో జరుగగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వన్ టౌన్ పోలీసులు, ఎస్టీఎఫ్ లు బందోబస్త్ నిర్వహించారు.కార్యక్రమానికి ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు
Related Posts
పశ్చిమాసియా శాంతి ఒప్పందంతో భారత్కు కలిగే లాభాలేంటి? రెండు వారాల తరువాత ఏం జరగనుంది?
పశ్చిమాసియాలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేయడమే కాకుండా భారత్కు కూడా…
పశ్చిమాసియాలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేయడమే కాకుండా భారత్కు కూడా…
పంచాంగం – మే 29, 2026 శుక్రవారం
శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఈరోజు అధిక జ్యేష్ట మాస శుక్ల పక్ష త్రయోదశి తిథి ఉ.09.50 వరకూ తదుపరి చతుర్దశి తిథి,స్వాతీ…
శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఈరోజు అధిక జ్యేష్ట మాస శుక్ల పక్ష త్రయోదశి తిథి ఉ.09.50 వరకూ తదుపరి చతుర్దశి తిథి,స్వాతీ…
గద్దెనెక్కి రెండేళ్లకు చేరువ… జ్వరాలొస్తే మాకేం సంబంధం అంటారా….?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా సమస్యల పట్ల, ప్రజల పట్ల పట్టించుకునే నాధుడే కరువయ్యారని విజయనగరం జేడ్పీ చైర్మన్,వైఎస్సార్సీపీ భీమిలి నియోజక వర్గ సమన్వయ…
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా సమస్యల పట్ల, ప్రజల పట్ల పట్టించుకునే నాధుడే కరువయ్యారని విజయనగరం జేడ్పీ చైర్మన్,వైఎస్సార్సీపీ భీమిలి నియోజక వర్గ సమన్వయ…