ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తన కం బ్యాక్ సినిమా హరి హర వీర మల్లు తో అంతగా మెప్పించకపోయినా, సుజీత్ OG తో మేజిక్ చేసి రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసాడు. ఇక ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తో మన ముందుకు రాబోతున్నాడు…
ఐతే నిన్ననే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని “దేఖ్‌లేంగే సాలా” పాట రిలీజ్ అయ్యి చరిత్ర సృష్టించింది. విడుదలైన కేవలం 24 గంటల్లోనే ఈ పాటకు 29.6 మిలియన్‌కు పైగా వ్యూస్ రావడం సినీ వర్గాలను, అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. సోషల్ మీడియాలో ఈ పాట ట్రెండ్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన క్యాచీ మ్యూజిక్ ఈ పాటకు బజ్ తీసుకువచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా చేసిన దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. అలాగే భాస్కరభట్ల రాసిన మోటివేషనల్, కమర్షియల్ టచ్ ఉన్న లిరిక్స్ పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
ఈ విజయంలో కల్ట్ క్యాప్టెన్ హరీష్ శంకర్ పాత్ర చాలా కీలకం. పవన్ కళ్యాణ్‌ను డ్యాన్స్ చేయించి అభిమానులకు విజువల్ ట్రీట్ అందించడంలో ఆయన పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా, సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ కలిసి ఈ పాటను రంగులమయంగా, కళ్లకు పండుగలా తీర్చిదిద్దారు.