Native Async

OTT లో దుమ్ము రేపుతున్న ధనుష్ ఇడ్లి కొట్టు…

Dhanush’s Idli Kottu OTT Success Beats Theatrical Result | Crosses 5 Million Views On Netflix
Spread the love

ధనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘ఇడ్లీ కొట్టు’ తమిళంలో నార్మల్ గానే ఆడింది తేటశ్రేస్ లో. కానీ తెలుగులో మాత్రం పూర్తిగా ఫ్లాప్ అయ్యిందనే చెప్పాలి. కథలోని భావోద్వేగం తెలుగువారికి కూడా కనెక్ట్ అవుతుందని టీమ్ నమ్మినా… ఆ అంచనా తప్పింది. అదే సమయంలో బాక్సాఫీస్ వద్ద ‘డూడ్’ సినిమా పోటీగా రావడం కూడా ఈ మూవీకి నష్టమే అయ్యింది.

ఇటీవల థియేట్రికల్ రన్‌ పూర్తయ్యాక ‘ఇడ్లీ కొట్టు’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చింది. రిలీజ్ అయ్యి వారం రోజులు కూడా కాకుండానే ఈ సినిమా 5 మిలియన్ వ్యూస్ దాటేసింది. అదే సమయంలో రిలీజ్ అయిన OG కు ఈ మార్క్ చేరుకోడానికి 11 రోజులు పట్టింది.

ఓ సాధారణ గ్రామీణ నేపథ్యంతో వచ్చిన, పెద్ద యాక్షన్ లేకుండా, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఉన్న సినిమా ఇలా భారీ రెస్పాన్స్ అందుకోవడం నిజంగా ఆశ్చర్యమే. థియేటర్‌ లో మిస్ అయిన చాలామంది ఫ్యామిలీతో కలిసి ఇంట్లో ఈ సినిమా చూసి, దానికి స్ట్రీమింగ్ బూస్ట్ ఇచ్చారు.

ఈ OТT విజయంతో ధనుష్ మార్కెట్ మరింత పెరిగినట్టే. ఇక ఆయన రాబోయే సినిమాలకు డిజిటల్ డీల్స్ కూడా భారీగానే రావడం ఖాయం. థియేటర్స్‌లో భావోద్వేగం ఓవర్ అనిపించిన ప్రేక్షకులు… ఓటిటి లో మాత్రం ధనుష్ స్టార్ పవర్‌కి వశులయ్యారు.

సింపుల్ సినిమా అయినా… కంటెంట్ కంటే స్టార్ పవర్ ఆన్లైన్‌లో ఎంత పెద్ద మ్యాజిక్ చెయ్యగలదో ఇడ్లీ కొట్టు మరోసారి ప్రూవ్ చేసింది. ఈ విజయంతో ధనుష్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడట… అభిమానులు కూడా ఆనందంలో మునిగిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit