ఇప్పటి వరకు మనం తెలుగు లో సందీప్ రెడ్డి వంగ నే బోల్డ్ డైరెక్టర్ అనుకున్నాం… కానీ ఇప్పుడు సందీప్ రెడ్డి ఫ్రెండ్ కూడా అలానే ఉన్నదే అని అనేక మానదు!
ఈరోజు ‘దిల్ దియా – ఎ నేకడ్ ట్రూత్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈరోజు సోషల్ మీడియా లో విడుదల చేశారు. ఈ చిత్రానికి స్పిరిట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తుండటం సినిమాపై మొదటి నుంచే ఆసక్తిని పెంచింది. ఈ ఫస్ట్ లుక్ చూస్తే, అసలు బోల్డ్ అంటే ఇది అనచ్చు!
పూర్ణ నాయుడు నిర్మాణంలో, శ్రేయాస్ చిత్ర – ఎ పూర్ణ నాయుడు ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కె. క్రాంతి మాధవ్ కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇంతకుముందు ఓనమాలు, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాల్లో మానవ సంబంధాల లోతును ఆయన చాలా సున్నితంగా చూపించారు.
ఈ పోస్టర్ చాలా మినిమల్గా, బోల్డ్ గా ఉంది. హీరో చైతన్య రావు చైర్ పై ఆలా కూర్చోవడం మాములు విషయం కాదు! ఈ విజువల్ టోన్ దర్శకుడి ఆలోచనలకు పూర్తిగా తగ్గట్టుగా ఉంది. స్టైలిష్ హంగులు కన్నా, రియాలిటీ చూపించినట్టు ఉంది!
ఈ చిత్రంలో చైతన్య రావు మడాది, ఇరా, సాఖీ, జెస్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే మణి చందన, ప్రమోదిని, వీర శంకర్ కీలక సహాయ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ క్యాస్టింగ్ కూడా కథకు అవసరమైన సహజత్వాన్ని పెంచేలా ఉంది.
కొత్త బాక్సాఫీస్ గ్రామర్‌తో రూపొందుతున్న ఈ చిత్రం సమ్మర్ 2026లో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.