దుల్కర్ సల్మాన్… ఈ వెర్సటైల్ నటుడు ఒక్క మలయాళ సినిమా లోనే కాదు, ఇటు తెలుగు, అటు హిందీ ఇంకా తమిళ్ లో కూడా సూపర్ గా సినిమాలు చేసేస్తున్నాడు! మొన్నే కదా లక్కీ భాస్కర్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు… ఇప్పుడు మళ్ళి ఒక పీరియాడిక్ డ్రామా కాంత తో 1960ల ఇండియన్ సినిమాకు లవ్లీ ట్రిబ్యూట్ ఇవ్వబోతున్నాడు…
ఈ సినిమాలో దుల్కర్ ఆనాటి సూపర్ స్టార్ గా కనిపిస్తారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దేగ్గపడుతుండడం తో తాజాగా ఒక రొమాంటిక్ సాంగ్ “అమ్మడివే…” సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాటను ప్రదీప్ కుమార్ పాడి మ్యూజిక్ లవర్స్ కి ఇంకో మంచి రొమాంటిక్ మెలోడియస్ సాంగ్ ని అందించాడు!
కాంత సినిమా పూర్తి గోల్డెన్ ఏరాకు ప్రేమతో చేసిన ట్రిబ్యూట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా కి సంబంధించి ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే, సినిమాను రానా దగ్గుబాటి ఇంకా దుల్కర్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. మొత్తానికి ఈ పాత సినిమా పైన అంచనాలను రెట్టింపు చేసింది… కానీ సినిమా కోసం 14th నవంబర్ వరకు ఆగక తప్పదు!