అమ్మో ఫ్రైడే అంటేనే సినిమాలు… ఆ సెంటిమెంట్ ఇప్పటిది కాదు కదా! ఒక ఐదు ఆరు దశాబ్దాలు దాటింది… శుక్రవారం సినిమాలు అంటే, అటు కాలేజీ స్టూడెంట్స్ కాలేజీ బంక్ కొట్టాల… ఆఫీస్ లో లీవ్ పెట్టాలా… ఇంకా ఇంట్లో ఐతే ఫస్ట్ షో సినిమా మన ఆడవాళ్లు చూడాల్సిందే… అదే మన ఫేవరెట్ హీరో సినిమా వస్తోదంటే చాలు, వారం ముందు నుంచి హడావిడి మొదలు కదా…
అలాగే మొన్న ఆగష్టు లో ఆల్రెడీ రజినీకాంత్ కూలీ ఇంకా మన NTR WAR 2 సినిమాలు చూసాం కదా… అలానే ఇప్పుడు సెప్టెంబర్ మొదలైంది… రేపు శుక్రవారం కాబట్టి, ఏ ఏ సినిమాలు థియేటర్ లో రిలీజ్ అవుతున్నాయో తెలుసుకుందామా…
ఐతే ఫస్ట్ మాట్లాడాల్సింది అనుష్క శెట్టి ‘ఘాటీ’ సినిమా గురించి… ఇది డైరెక్టర్ క్రిష్ తీసిన సినిమా కాబట్టి, స్టోరీ, టేకింగ్ గురించి మాట్లాడక్కర్లేదు. ట్రైలర్ లోనే మనకి ఇది ఒక ఆడ పులి శీలావతి గురించి ఆమె ధైర్య సాహసాల గురించి తీసింది అని తెలిసింది… ఘాట్ ల మీద నివసించే వారిని ఘాటీ లు అంటారు… అలా వారు, ఆ కొండా మీద నుంచి, ఘాట్ దాటి, వాగులు దాటి సరుకులు రవాణా చేస్తారు… అది వారి వృత్తి… కానీ అనుకోని పరిస్థితుల్లో తన వారిని తన వారి ఉనికిని ఎలా శీలావతి కాపాడిందో సినిమాలోనే చూడాలి…
నెక్స్ట్ AR మురుగదాస్ ఇంకా శివ కార్తికేయన్ ల మదరాసి సినిమా గురించి చెప్పాలి…
మదరాసి సినిమా కథ విషయానికి వస్తే, తమిళనాడులో పెరిగిపోతున్న నార్త్ ఇండియా మాఫియా శక్తుల మధ్య, వాటిని కట్టడి చేసేందుకు ఏర్పాటైన రెండు స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ల మధ్య జరిగే యాక్షన్ ప్యాక్డ్ డ్రామాగా ఇది తెరకెక్కింది. ఈ క్రమంలో రఘు అనే యువకుడు కథలో ప్రధాన పాత్రగా నిలుస్తాడు, ఆ పాత్రలో శివకార్తీకేయన్ కనిపించనున్నారు. సాధారణంగా కనిపించే రఘు, తన జీవితం ఒక్కసారిగా మాఫియా దాడులతో మారిపోవడంతో వారిని ఎదుర్కొనే ధైర్యవంతుడిగా మారతాడు. కథలో లవ్, పగ, ప్రతీకారం, త్యాగం, స్నేహం, రెండు శక్తివంతమైన గ్రూపుల మధ్య జరిగే వార్ అన్నీ కలగలిపి ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉండబోతున్నాయని తెలుస్తోంది.
ఇంకా ’90s మిడిల్ క్లాస్’ వెబ్ సిరీస్ తో వెలుగులోకి వచ్చిన మౌళి Little హార్ట్స్ సినిమా తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు! ఇది మంచి ఫీల్ గుడ్ ఈ జనరేషన్ లవ్ స్టోరీ!
తరువాత రేపు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్బంగా నివేత థామస్, ప్రియదర్శి ల ‘౩5 చిన్న కథ కాదు’ సినిమా కూడా రి-రిలీజ్ అవ్వబోతోంది…
సో, ఈ సినిమాలు చూసి మీ రివ్యూస్ కామెంట్ సెక్షన్ లో పెట్టండి!
ఈ ఫ్రైడే రిలీజ్ అవుతున్న కొత్త సినిమా కబుర్లు…

Spread the love