ఇప్పుడంతా మిరాయి సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు… చాల మంది ఈ సినిమా లో ఎక్కువ VFX అంటే గ్రాఫిక్స్ వాడారు అని అనుకుంటున్నారు. కానీ తేజ సజ్జ ఒక ఇంటర్వ్యూ లో మేము గ్రాఫిక్స్ వాడాము, అలానే చాల మటుకు ఒరిజినల్ యాక్షన్ సీక్వెన్స్ కూడా చేసాం అని… ఒక ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ గురించి కూడా చెప్పాడు. యాక్టుల్ గా ఈ మధ్య చాల సినిమాలు గ్రాఫిక్స్ మీద ఆధారపడుతున్నాయి అన్న సంగతి తెలిసిందే… ఐతే ఎక్కడ మన తేజ సజ్జ ‘హను-మాన్’ ఇంకా ‘మిరాయి’ పాస్ అయ్యాయో, ఎక్కడ ‘మహావతార్ నరసింహ’ లాంటి సినిమాలు అదరగొట్టాయో, అక్కడే ప్రభాస్ ‘ఆదిపురుష్’, పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ ఫెయిల్ అయ్యాయి. ఎందుకు ఇంత భారీ బడ్జెట్, ఇంత పెద్ద హీరోలు ఉన్న గ్రాఫిక్స్ వర్క్స్ అంత మంచిగా ప్రెసెంట్ చేయలేదు అంటే, సమాధానాలు లేవు.

అలాగే మనం ‘మహావతార్ నరసింహ’ సినిమా లో మొత్తం గ్రాఫిక్స్ తోనే చేసారు. మన పురాణాల్ని ఇంత కంటే మంచిగా చూపించచ్చా అని ఆశ్చర్యపోయేలా చేసారు. ఈ జనరేషన్ పిల్లలకి ఇలానే మన పురాణాలూ, దేవుళ్ళ గురించి చెప్తే మంచిగా వింటారు, మంచి పద్దతుల కి అలవాటు పడతారు అన్నంత గా మెప్పించింది ఈ సినిమా.
కేవలం 40 కోట్ల తో ఇంత ఫుల్ సినిమా గ్రాఫిక్స్ తోనే తీసిన పాయింట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. ఐతే ఇక తేజ సజ్జ ‘హను-మాన్’ కూడా గ్రాఫిక్స్ తో మాయ సృష్టించారు. ఈ సినిమా కూడా అంతే బడ్జెట్ తో తీసి ప్రేక్షకులను కట్టిపడేసారు. ఇంకా బాలీవుడ్ ప్రేక్షకులని కూడా కట్టి పడేసారు.

ఇక ఇప్పుడు మిరాయి సినిమా గురించి మాట్లాడితే, మళ్ళి మన పురాణాలూ, గొప్ప రాజు అశోకుడి చరిత్ర తో ముడిపెట్టి మరి, సినిమా లో హీరో తొమ్మిది గ్రంధాలు కాపాడాలి, విలన్ బ్లాక్ స్వోర్డ్ ఆ గ్రంధాలు కొట్టేయాలి అని స్టోరీ చెప్పి మరి హిట్ కొట్టారు చూడు అది మన స్టైల్.
ఈ సినిమా లో కూడా గ్రాఫిక్స్ బాగానే వాడారు అలానే బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు??? కేవలం 50 కోట్లు. ఎస్ మీరు చదివింది నిజమే… అందుకే కదా అందరు షాక్ అవుతున్నారు. మరి క్వాలిటీ గ్రాఫిక్స్ కావాలంటే వందల కోట్లు ఖర్చుపెట్టక్కర్లేదు. జస్ట్ సరైన ఔట్పుట్ ఎలా రాబట్టలో తెలిస్తే చాలు కదా.