మళ్ళి పవన్ కళ్యాణ్ ఫాన్స్ తో కనెక్ట్ అవుతున్న ఉస్తాద్ డైరెక్టర్ హరీష్ శంకర్

Harish Shankar and Pawan Kalyan Fans Reunite Ahead of Ustaad Bhagat Singh Release

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుల్లో హరీష్ శంకర్ పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. దాదాపు పదేళ్ల పాటు పవన్ బ్లాక్బస్టర్ కొట్టకపోయిన, 2012లో గబ్బర్ సింగ్ రూపంలో పవన్ అభిమానులకు మరపురాని హిట్‌ను అందించారు హరీష్. అది అధికారికంగా రీమేక్ అయినప్పటికీ, కథన విధానం, పవన్‌ను పవర్‌ఫుల్‌గా, స్టైలిష్‌గా తెరపై చూపించి అభిమానులను ఉర్రూతలూగించారు.

తానే పవన్‌కు పెద్ద అభిమానిగా అని చెప్పి, అందుకు తగినట్టు అభిమానులు తమ స్టార్‌ను తెరపై ఎలా చూడాలనుకుంటారో హరీష్‌కు బాగా తెలుసు. అందుకే గబ్బర్ సింగ్ పవన్ కెరీర్‌లో ఓ ల్యాండ్‌మార్క్‌గా నిలిచింది. ఆ సినిమా ద్వారా హరీష్ శంకర్‌కు పవన్ అభిమానుల హృదయాల్లో స్పెషల్ ప్లేస్ లభించింది.

అయితే, చాలా సంవత్సరాల తర్వాత హరీష్ – పవన్ మళ్లీ కలిసి సినిమా చేయబోతున్నారనే వార్త బయటకు రాగానే, కొత్త సినిమా కూడా రీమేక్ అనే ప్రచారం మొదలవడంతో, పవన్ రీ-ఎంట్రీ తర్వాత వరుసగా రీమేక్‌లు చేస్తున్నాడనే అసంతృప్తిలో ఉన్న కొందరు అభిమానులు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు.

ఈ సినిమా తమిళ హిట్ ‘థెరి’కి రీమేక్ అన్న రూమర్లు బలంగా వినిపించడంతో, సోషల్ మీడియాలో ఒక వర్గం అభిమానులు బహిరంగంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్‌ను డ్రాప్ చేయాలని పవన్‌ను కోరారు. ఈ విమర్శలకు గట్టిగా స్పందించిన హరీష్ శంకర్, ట్రోలింగ్ చేస్తున్నవారిని, సినిమాకు వ్యతిరేకంగా మాట్లాడిన అనేక ఫ్యాన్ అకౌంట్లను X (ట్విట్టర్)లో బ్లాక్ చేశారు. ఇందులో కొన్ని ప్రముఖ ఫ్యాన్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి.

ఐతే ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ కాదనే సంకేతాలు బయటకు రావడంతో, సినిమాపై నెగటివిటీ క్రమంగా తగ్గిపోయింది. విడుదల దగ్గర పడుతున్న కొద్దీ, చాలా మంది అభిమానులు తమ వైఖరిని మార్చుకొని, హరీష్‌ను అన్‌బ్లాక్ చేయాలని, పాజిటివ్‌గా ముందుకు సాగాలని కోరడం మొదలుపెట్టారు.

అందుకు సోషల్ మీడియా లో స్పందించిన హరీష్ శంకర్, “మనమంతా ఒకే కుటుంబం” అని చెప్పుతూ అభిమానులను మళ్లీ అన్‌బ్లాక్ చేయడం ప్రారంభించారు. ఇలా దర్శకుడు – అభిమానుల మధ్య మళ్లీ ఐక్యత ఏర్పడటాన్ని, ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ముందు ఒక మంచి సంకేతంగా పవన్ అభిమానులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *