మన మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే కదా… ఆ కామెడీ, ఆ యాక్షన్, ఆ రొమాన్స్, అబ్బో అన్ని బాగా కుదిరాయి… ఇంకా చిరంజీవి NIA ఆఫీసర్ కాబట్టి, అతని టీం లో హర్షవర్ధన్, కాథరిన్, అభినవ్ చేసిన హుంగామ మాములుగా లేదు పెద్ద తెర మీద.
ఐతే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే కదా… నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో నిర్మాతలు, దర్శకుడు, బుల్లి రాజు ఇలా అందరు చాల ఎమోషనల్ గా మాట్లాడి తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు…
ఇక హర్షవర్ధన్ విషయానికి వస్తే, తనుచాల సినిమాల్లో చేసాడు… సీరియల్స్ చేసాడు… అమృతం సిరీస్ ద్వారా ఫేమస్ కూడా అయ్యాడు… కానీ మెగాస్టార్ తో సినిమా చేయడం ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అందరికి… ఆ ఛాన్స్ వచ్చేసరికి చాల బాగా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ లో పాల్గొంటుండగా… సడన్ ఆక్సిడెంట్…
ఇలా తన కి జరిగిన ఆక్సిడెంట్ గురించి సక్సెస్ మీట్ లో చెప్తూ, దర్శకుడు అనిల్ ఎలా హేండిల్ చేసాడో చెప్పి సూపర్ అనిపించాడు. ఆక్సిడెంట్ జరిగే టైం కి 40 % షూటింగ్ కంప్లీట్ అయ్యింది… కానీ అనుకోకుండా తన ఆఫీస్ లో కాలు జారీ కిందపడడం వల్ల ankle మొత్తం ఫ్రాక్చర్ అయ్యింది అని చెప్తూ, అనిల్ కి ఈ విషయం కాల్ చేసి చెప్తే, పర్లేదు నీకు అచ్తింగ్ వచ్చు కదా అని… చాల అలోచించి షూటింగ్ కంప్లీట్ చేసాడు అని చెప్పాడు.
ఇంకా ఒక సీన్ తో తనకి స్పెషల్ ఎంట్రీ ఇచ్చి సూపర్ అనిపించాడు… అసలు నాకు ఆక్సిడెంట్ అయిన విషయం సినిమా చుస్తే తెలియదు… అదే తన ఫ్రెండ్స్ అందరు అడిగారని చెప్పాడు. ఇలా వచ్చిన ఛాన్స్ పోయే లాగ ఉన్న, దర్శకుడు అనిల్ తన చాచాక్యం తో, సినిమా పూర్తి చూపించాడు అని మెచ్చుకుని… ఆనందంగా అనిల్ కి థాంక్స్ చెప్పాడు!
సినిమాలోంచి నన్ను తీసేయ్.. వేరే యాక్టర్ తో చేయించు అని చెప్పినా కూడా నీకు చిరంజీవి అంటే అంత ఇష్టమో నాకు తెలుసు, సో కంగారు పడకు, నేను చూసుకుంటా అని చెప్పి సినిమా కంప్లీట్ చేయించడం సూపర్!
అనిల్ రావిపూడి.. నన్ను కూర్చోబెట్టి సినిమా కంప్లీట్ చేశాడు అని చాల మెచ్చుకున్నాడు హర్షవర్ధన్!