మ్యూజిక్ ఇండస్ట్రీలో మాస్టర్, లెజెండరీ కాంపోజర్ ఇలైయరాజా తన ఐకానిక్ పాటలను వాడి తన నిబంధనను ఉల్లంఘించిన ప్రతి సినిమా పై చసెస్ వేస్తున్నాడు. ఏయే ప్రొడ్యూసర్స్ అతని అనుమతి లేకుండా పాటలను ఉపయోగిస్తే, వారి పై కోర్టులో కేసులు వేస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఇలా చేస్తున్నారని, ఇప్పటికే అనేక నిర్మాతలు కాపీరైట్ ఉల్లంఘనకు సంబంధించిన పరిహారం చెల్లించారని తెలిసింది. పాటల ఆడియో రైట్స్ కలిగిన మ్యూజిక్ లేబుల్స్ కూడా ఇలైయరాజాతో లీగల్ బాటిల్స్‌లో నడుస్తున్నాయి.
ఇటీవల అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బాడ్ అగ్లీ’ సినిమాలో కూడా ఇలైయరాజా పాటలు అనుమతి లేకుండా ఉపయోగించబడటంతో, నిర్మాతల పై మద్రాస్ హై కోర్ట్ తక్షణ ఆంక్షలు విధించింది.
ఇక ఇప్పుడు ప్రదీప్ రంగనాధన్ ‘డ్యూడ్’ సినిమా వంతు… ఈ సినిమాలో రెండు పాత పాటలను అనుమతి లేకుండా సోనీ మ్యూజిక్ ఉపయోగించిందని కోర్టులో ఫిర్యాదు చేశారు. మద్రాస్ హై కోర్ట్ ఇప్పుడు ఇలైయరాజాకు కేసు ఫైల్ చేయడానికి అనుమతిచ్చింది.

తాజా అప్డేట్ ప్రకారం, సోనీ మ్యూజిక్ ఇంకా సమాధానం ఇవ్వలేదని, ‘డ్యూడ్’ సినిమాలో పాటలు అనుమతి లేకుండా ఉపయోగించబడుతున్నాయని చెప్పారు. ఈ కేసు సుప్రీంకోర్టులో కూడా పెండింగ్ లో ఉన్న కారణంగా, తదుపరి వాయిదా రాబోయే నెల 19న ఉండనుంది. సుప్రీంకోర్ట్ సోనీ మ్యూజిక్‌ను ఈ పాటల ద్వారా వచ్చే ఆదాయం వివరాలను సమర్పించమని ఆదేశించింది.
ఇప్పటివరకు డ్యూడ్ సినిమా 100 కోట్ల మార్క్ వైపు దూసుకుపోతోంది. కానీ ఈ లీగల్ యుద్ధం వల్ల సినిమా యూనిట్‌కి పెద్ద సవాలు ఎదురవుతుంది.