తళపతి విజయ్ చివరిసారిగా వెండితెరపై కనిపించబోతున్న సినిమా ‘జన నాయకన్’. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టిన విజయ్‌కు ఇది చివరి సినిమా కావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదలయ్యేలా కనిపించడం లేదు. సెన్సార్ బోర్డు నుంచి వచ్చిన అడ్డంకుల కారణంగా చిత్రబృందం సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే… సీబీఎఫ్‌సీ కమిటీ సభ్యుల్లో ఒకరు, తన అభ్యంతరాలను సరైన విధంగా నమోదు చేయకుండా సర్టిఫికెట్ సిఫార్సు చేశారని సీబీఎఫ్‌సీ చైర్మన్‌కు లేఖ రాసినట్టు సమాచారం. ఈ అంశంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసిన కొద్ది గంటలకే ‘జన నాయకన్’ వాయిదా ప్రకటన వచ్చింది.
ఐతే ఈ సినిమా పోస్టుపోన్ అవ్వడం అసలు విజయ్ ఫాన్స్ కి షాక్… పొంగల్ సీజన్లో కావడం తో మంచి రిలీజ్ డేట్ సెట్ చేసుకుని, తమిళ్ లో సింగల్ గా వద్దాం అనుకున్నారు. తెలుగు లో ఎలాగో రాజా సాబ్ ఉంది కాబట్టి, ఒకే సినిమా ప్రస్తుతానికి పోటీ ఉండేది. కానీ ఇప్పుడు సినిమా ఇంకో రెండు రోజులు రిలీజ్ ఆలస్యం అయినా కానీ, అటు చిరు మన శంకర వర ప్రసాద్, నవీన్ పోలిశెట్టి, రవి తేజ ఇంకా శర్వానంద్ సినిమాలు లైన్ గా ఉన్నాయ్. థియేటర్స్ లో అనుకున్న స్క్రీన్స్ దొరకడం కష్టం.
ఇక తమిళ్ లో శివ కార్తికేయన్ పరాశక్తి కూడా వెంటనే రిలీజ్ ఉంది… సో, ఇప్పుడు కాకపోతే ఇంకా ఫిబ్రవరి ఏ నా అని విజయ్ ఫాన్స్ అంటున్నారు!