సూపర్ కృష్ణ వారసత్వాన్ని మహేష్ బాబు చాల చక్కగా క్యారీ చేయటం మనం చూస్తున్నాం… ఇప్పుడు రాజమౌళి వారణాసి సినిమా తో గ్లోబల్ స్థాయికి వెళ్ళాడు! ఇక మహేష్ తరవాత, సూపర్ స్టార్ కృష్ణ మనవడు అశోక్ గల్లా కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు… అలాగే మంజుల కూతురు జాన్వీ ఒక నగల యాడ్ లో మెరిసింది… ఇక నెక్స్ట్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు… అయన పెద్ద కొడుకు జయ కృష్ణ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
జయ కృష్ణ ‘RX 100 ‘ ఫేమ్ అజయ్ భూపతి తో తన ఫస్ట్ సినిమా చేయబోతున్నాడు! అదే శ్రీనివాస మంగాపురం. ఈ సినిమా లో రవీనా టాండన్ కూతురు రాష టాండన్ హీరోయిన్. తనకి కి కూడా ఇది ఫస్ట్ సినిమా నే!
ఇక ఈరోజు మహేష్ బాబు శ్రీనివాస మంగాపురం నుంచి, జయ కృష్ణ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసాడు… అందులో జయ, అసలు సూపర్ గా ఉన్నాడు… బైక్ నడుపుతూ, ఒక చేతిలో గన్ పెట్టుకుని, ఒక యాక్షన్ సీక్వెన్స్ లో ఉన్నట్టు చూపించారు… ఇది చాల బాగుంది! అలాగే మహేష్ బాబు కూడా తన అన్న కొడుకు కి అల్ ది బెస్ట్ చెప్తూ, ఇది ఒక ఇంటరెస్టింగ్ బిగినింగ్ అని పోస్ట్ చేసాడు! ఇక ఈ సినిమా ని అశ్విని దత్ ప్రెసెంట్ చేస్తుండడం విశేషం!