రిషబ్ శెట్టి సృష్టించిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘కాంతారా: చాప్టర్ 1’ ఇప్పుడు భారతీయ సినీ చరిత్రలో మరో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ సినిమా, విడుదలై ఎన్నో వారాలు గడిచినా కూడా థియేటర్లలో ఇంకా successful గా రన్ అవుతుంది…
తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 100 కోట్ల రూపాయల మార్క్ ని ఎప్పుడో దాటింది. ఇది కేజీఎఫ్ 2 తర్వాత ఇంత భారీగా వసూళ్లు సాధించిన రెండవ డబ్‌డ్ సినిమా కావడం విశేషం. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి సినిమా కలెక్షన్ ఇప్పటికే 110 కోట్లు దాటింది.
ఇంతటితో ఆగలేదు… ప్రపంచవ్యాప్తంగా ఈ అద్భుత చిత్రం 800 కోట్ల రూపాయల మార్క్‌ని కూడా దాటేసింది! ఇప్పటి వరకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ చిత్రం 818 కోట్లు గ్లోబల్ కలెక్షన్స్ సాధించి, 2025 సంవత్సరానికి అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ సినిమాగా నిలిచింది.

ప్రతి వారం కొత్త సినిమాలు విడుదలవుతున్నా, కాంతారా చాప్టర్ 1 వసూళ్ల పరంగా ఏ మాత్రం తగ్గడం లేదు. అద్భుతమైన కథ, అద్భుతమైన విజువల్స్, ఇంకా రిషబ్ శెట్టి నటనతో ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది.
ఇక మరో సర్‌ప్రైజ్ కూడా సిద్ధంగా ఉంది — ఈ నెల 31వ తేదీన ఇంగ్లీష్ డబ్‌డ్ వెర్షన్ రిలీజ్ చేయబోతున్నారు. కాస్త కాంపాక్ట్ రన్‌టైమ్‌తో, కొత్తగా ఎడిట్ చేసిన ఈ వెర్షన్‌తో సినిమా మరికొన్ని రికార్డులను తిరగరాయబోతోందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.

మొత్తం మీద, రిషబ్ శెట్టి తెరపై మళ్లీ తన మ్యాజిక్‌ని చూపించాడు. కేజీఎఫ్ తర్వాత హోంబలే ఫిలింస్ నుండి వచ్చిన మరో పాన్ ఇండియా గర్జనగా, కాంతారా చాప్టర్ 1 ఇప్పుడు ఇండియన్ సినిమాకు గర్వకారణమైంది!