బెల్లంకొండ కిష్కింధపురి ప్రీమియర్ షో అదిరిపోయింది…

Bellamkonda Sreenivas Movie Kishkindhapuri
Spread the love

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వస్తున్న చిత్రం కిష్కింధపురి. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. భైరవం తర్వాత వస్తున్న ఈ సినిమాపై బెల్లం కొండ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ నెల 12న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు బెల్లం బాబు.

కాగా ఈ సినిమా నిన్న రాత్రి హైదరాబాద్ లోని AAA ముల్టీప్లెక్స్ లో ప్రీమియర్ షో ప్రదర్శించారు. సినిమా చుసిన ఆడియెన్స్ టాక్ ఎలా ఉందంటే.. మొదటి 10 నిమిషాలు కథలోకి వెళ్లేందుకు టైమ్ తీసుకున్న దర్శకుడు ఎప్పుడైతే కిష్కింధపురిలోని సువర్ణ మాయలోకి అడుగుపెడతారో అక్కడ నుండి సినిమాను పరిగెత్తిస్తూ భయపెట్టేసాడు. ఫస్టాఫ్ ను ఎటువంటి అదనపు హంగులకు వెళ్లకుండా అనుకున్న పాయింట్ ను తెరపై అంతే చక్కగా ప్రెసెంట్ చేసాడట.

ఇక సెకెండ్ హాఫ్ కూడా అంతే గ్రిప్పింగ్ గా హారర్ ఎలిమెంట్స్ ని ఎక్కడ తక్కువ చేయకుండా అదరగొట్టాడు డైరెక్టర్. తమిళ నటుడు శాండ నటన గూస్ బమ్స్ తెప్పిస్తాయి. అనుపమ పరమేశ్వరన్ క్లైమాక్స్ లో చేసిన పర్ఫామెన్స్ సూపర్ అనే చెప్పాలి. థ్రిల్లర్ ఎపిసోడ్స్  స్టోరీ నేరేషన్ చాలా బాగుందని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సౌండ్. ఎం.ఆర్. రాజా కృష్ణన్ ఇచ్చిన సౌండింగ్. హారర్ సినిమాను సౌండ్ తో ఎంత మ్యాజిక్ చేయచ్చో అంత చేసాడు. ఓవరాల్ గా చెప్పాలంటే కిష్కింధపూరి మిమ్మల్ని భయపెడుతూ సీట్ ఎడ్జె లో కూర్చోబెట్టి మరి అలరిస్తుంది. పార్ట్ 2 కోసం ఇచ్చిన లాస్ట్ మినిట్ ట్విస్ట్ చాలా బాగుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *