ఈసారి మహా కుంభమేళా ఎంత ఘనంగా జరిగిందో మన అందరికి తెలిసిందే కదా… దేశ విదేశాల నుంచి కూడా వచ్చి కుంభమేళా లో పుణ్య స్నానాలు ఆచరించారు! ఐతే మహా కుంభమేళా ఒకరి జీవితాన్ని మాత్రం పూర్తిగా మార్చేసింది! ఎవరో తెలుసు కదా… అదే మోనాలిసా…

మహాకుంభమేళాలో పూసల మాలలు అమ్ముకుంటూ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన మోనాలిసా జీవితం రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది. అందుకే మోనాలిసా ఇప్పుడు వెండితెరపై కూడా సందడి చేయబోతోంది అని మన అందరికి తెలుసు.
తాజాగా ఆమె ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె ఓ తెలుగు సినిమాలో లీడ్ రోల్లో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. ఎయిర్‌పోర్టులో ఈ బ్యూటీని చూసిన నెటిజన్స్.. అందంగా మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.