మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మన శంకర వర ప్రసాద్ గారు సినిమాకు, విడుదలకు ముందే సరైన టైమ్‌లో భారీ హైప్ దక్కింది. బుధవారం విడుదలైన ‘హుక్ స్టెప్’ పాట క్షణాల్లోనే విజిల్-worthy బ్లాక్‌బస్టర్‌గా మారి సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
చిరంజీవి ఎనర్జిటిక్ డాన్స్ మూమెంట్స్, వింటేజ్ గ్రేస్, ఎఫర్ట్‌లెస్ స్వాగ్ అన్ని కలిపి ఈ పాటను మాస్ రేంజ్‌లో వైరల్ చేశాయి. మ్యూజిక్, లిరిక్స్‌లో మోడ్రన్ టచ్ ఉన్నప్పటికీ, చిరు స్టైల్ మాత్రం పాత రోజులను గుర్తు చేసేలా ఉండటంతో మెగా ఫాన్స్ మాత్రమే కాదు… అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ పాటపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
‘హుక్ స్టెప్’ లిరికల్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే సోషల్ మీడియాలో చిరంజీవి సిగ్నేచర్ డాన్స్ స్టెప్స్‌ను గుర్తు చేసుకునే ఎడిట్స్ అన్ని ట్రెండ్ అవుతున్నాయి. భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన గ్రూవీ ట్యూన్‌కు బాబా సెహగల్ తన ప్రత్యేక వాయిస్‌తో మరో లెవల్ ఎనర్జీ జోడించారు.
ఇప్పటికే రిలీజైన తొలి పాట ‘మీసాల పిల్ల’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేసింది. ట్రైలర్, ఎంతో హైప్ చేసిన చిరు-వెంకీ పాట మంచి రెస్పాన్స్ తెచ్చినా… ‘హుక్ స్టెప్’ మాత్రం పూర్తిగా గేమ్‌ని మార్చేసింది. ఈ పాటలో చిరంజీవిని ప్రైమ్ ఫామ్‌లో చూపించినందుకు కొరియోగ్రాఫర్ ఆటా సందీప్‌కు స్పెషల్ క్రెడిట్ ఇవ్వాల్సిందే.
ఇంకా విడుదలకు వారం కూడా మిగలని ఈ సమయంలో, ‘హుక్ స్టెప్’ సాంగ్ ఇచ్చిన బజ్ సంక్రాంతి సీజన్‌లో సినిమాకు స్ట్రాంగ్ ఓపెనింగ్స్ అందించే అవకాశం ఉంది. పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ, పాజిటివ్ టాక్ వస్తే చిరంజీవి రూపంలో టాలీవుడ్ బాక్సాఫీస్‌లో నిజమైన స్టార్మ్ తప్పదనేలా ఉంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కానుంది.