300 కోట్ల మార్క్ దెగ్గరలో మెగాస్టార్ మన శంకర వర ప్రసాద్ కలెక్షన్స్…

Mana Shankara Vara Prasad Garu Heads Towards ₹300 Cr, Set to Become Chiranjeevi’s Biggest Grosser

మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్‌ రవిపూడి కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తుంది. పండుగ సీజన్‌లో భారీ పోటీ ఉన్నప్పటికీ, ఈ సినిమా విడుదలైన తొలి వారం నుంచే అద్భుతమైన బాక్సాఫీస్‌ నంబర్లతో దూసుకుపోతోంది.

ఓపెనింగ్‌ డే నుంచే ఈ సినిమా ప్రభంజనం మొదలైంది. ప్రీమియర్స్‌ సహా తొలి రోజే రూ.84 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసి ట్రేడ్‌ను ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత కూడా ఎక్కడా జోరు తగ్గకుండా, ప్రతిరోజూ రూ.30–35 కోట్ల రేంజ్‌లో స్థిరమైన వసూళ్లు సాధిస్తోంది. నిన్న ఒక్కరోజే రూ.31 కోట్లు వసూలు చేయడంతో, ఈ సినిమా వరల్డ్‌వైడ్‌ కలెక్షన్లు రూ.292 కోట్లకు చేరాయి. ఈ రోజు రూ.300 కోట్ల మైలురాయిని దాటడం దాదాపు ఖాయం అని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ క్రమంలోనే, అనిల్‌ రవిపూడి కెరీర్‌లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను కూడా ఈ రోజు అధిగమించబోతోంది మన శంకర వర ప్రసాద్‌ గారు. అంతేకాదు, చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచే దిశగా ఈ చిత్రం వేగంగా అడుగులు వేస్తోంది.

ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా నార్త్‌ అమెరికాలో మాత్రమే $2.96 మిలియన్‌కి పైగా వసూళ్లు సాధించి, చిరంజీవి అనిల్‌ రవిపూడి ఇద్దరి రికార్డులనూ బ్రేక్‌ చేసింది. ఈ స్థాయి కలెక్షన్లతో మ్స్గ్ ప్రాంతీయ సినిమాల్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచే స్థాయికి చేరుకుంది.

థియేటర్లలో ప్రస్తుతం ఉన్న వాతావరణం చూస్తే, సినిమా సక్సెస్‌ ఎంత ఘనంగా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. అన్ని చోట్లా హౌస్‌ఫుల్‌ బోర్డులు, పండుగలాగే థియేటర్లలో సందడి, పెద్ద సంఖ్యలో కుటుంబ ప్రేక్షకుల హాజరు ఈ సినిమాకు ప్రధాన బలంగా మారాయి. చిరంజీవి మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, అనిల్‌ రవిపూడి స్టైల్‌ హ్యూమర్‌ కలిసి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *