మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన వింటేజ్ ఛార్మ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ క్రేజ్ స్పష్టంగా బాక్సాఫీస్ వద్ద కనిపిస్తోంది.
గత 24 గంటల్లోనే బుక్‌మైషోలో 4,88,320 టికెట్లు అమ్ముడై, ప్రాంతీయ సినిమాల్లోనే అత్యధిక బుకింగ్స్ సాధించిన చిత్రంగా MSG రికార్డు సృష్టించింది. కుటుంబ ప్రేక్షకులు భారీ సంఖ్యలో థియేటర్లకు తరలివస్తుండటంతో ఈ సినిమా కలెక్షన్లు దూసుకుపోతున్నాయి.
ఈ సినిమా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. నిర్మాతలు కూడా ఈ వార్త ని కంఫర్మ్ చేసి సోషల్ మీడియా లో అనౌన్స్ చేసారు! ఇంకా ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్‌గా నిలిచింది. గతంలో సై రా నరసింహారెడ్డి సాధించిన రికార్డును మన శంకర వర ప్రసాద్ గారు అధిగమించింది.
సాధారణంగా శుక్రవారం విడుదలైన సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ సోమవారం విడుదలైనప్పటికీ MSG అసాధారణమైన నంబర్స్ సాధించడం విశేషం. ఈరోజు కూడా బుకింగ్స్ బలంగా కొనసాగుతున్నాయి. రేపటి నుంచి హాలిడే సీజన్ ప్రారంభం కానుండటంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
నార్త్ అమెరికాలో కూడా ఈ సినిమా సంచలన ప్రదర్శన కొనసాగిస్తోంది. ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజే $1.7 మిలియన్‌కు పైగా వసూలు చేసి, చిరంజీవి కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనింగ్‌గా నిలిచే దిశగా దూసుకుపోతోంది. ఈ వేగం చూస్తుంటే మన శంకర వర ప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.