ఎంతైనా మెగాస్టార్ అంటే మెగాస్టార్ ఏ… అయన అచ్తింగ్ కి డాన్స్ కి స్వాగ్ కి సతి ఎవ్వరు రారు… మళ్ళి ఆ విషయాన్ని అనిల్ రావిపూడి తీసిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమా తో నిరూపించారు… ఐతే మొదటి రోజే ఈ సినిమా 84 కలెక్ట్ చేసి, రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇక మూడో రోజు కలెక్షన్ డబుల్ అయ్యి 152 కోట్లకు చేరింది… మరి నాలుగో రోజు కలెక్షన్ ఎంతో తెలుసా???
ఏకంగా ఈ సినిమా ఇప్పుడు 190 కోట్ల కలెక్షన్ సాధించి సూపర్ బ్లాక్బస్టర్ గా మారింది… ఈ సినిమా కి ప్రీమియర్ షోస్ నుంచే మంచి పాజిటివ్ టాక్ రాగ, ఇక ఫస్ట్ డే నుంచే ఫామిలీ ఆడియన్సు కూడా బాగా ఎంజాయ్ చేసారు. కాన్సెప్ట్ బాగుంది, పైగా నయనతార జోడి… ఇంకా వెంకటేష్ కామియో… ఇది చాలదు, సినిమా ఎలా ఎలివేట్ అయ్యిందో చెప్పడానికి!
ఇక లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్ ట్విట్టర్ లో షేర్ చేసి, నిర్మాతలు కూడా మెగా ఫాన్స్ ని ఖుష్ చేసారు. ఇక నెక్స్ట్ అంత వీకెండ్ కాబట్టి, కలెక్షన్స్ డబుల్ అవుతాయి… త్వరలో ఈ సినిమా 500 కోట్ల క్లబ్ లో చేరుతుందని అంటున్నారు…