మంచు మనోజ్… మోహన్ బాబు కొడుకైన కానీ తెరపై తన ఎనర్జీతో, తన సొంత స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఈ మధ్య మళ్లి సినిమాలతో బిజీ అయ్యాడు… మిరాయి తో హిట్ కొట్టి, ఫుల్ జోష్ మీద ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఒక కొత్త మ్యూజిక్ కంపెనీ ‘మోహన రాగ మ్యూజిక్’ బ్యానర్‌ను స్టార్ట్ చేసాడు… ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ, తన ఫాన్స్ ని ఖుష్ చేసాడు…
కొన్నేళ్ళక్రితం ‘ప్యార్ మేన్ పడిపోయా’ పాటను తనదైన స్టైల్లో పాడి ప్రేక్షకులను అలరించారు. కరోనా సమయంలో విడుదల చేసిన ‘అంతా బాగుంటమ్రా’ పాట ఎంతో మందికి ధైర్యం ఇచ్చింది. ‘పిస్తా పిస్తా, ఎన్నో ఎన్నో, ప్రాణం పోయే బాధా’ వంటి పాటలకు సాహిత్యం రాసి సూపర్ తినిపించాడు.
ఆల్రెడీ తన తండ్రి డాక్టర్ మంచు మోహన్ బాబు, అన్న మంచు విష్ణు, అక్క లక్ష్మీ మంచు సినిమాల్లో సంగీతం, యాక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. హాలీవుడ్ చిత్రం Basmati Blues (Brie Larson నటించిన) కోసం సంగీతంలో పనిచేయడం ఆయన క్రియేటివిటీకి అంతర్జాతీయ దారులు తెరిచింది.
చాలా త్వరలో ఈ మ్యూజిక్ లేబుల్ నుంచి ఒరిజినల్ సింగిల్స్, ప్రత్యేక కోలాబరేషన్స్, ఇంకా అంతర్జాతీయ స్థాయిలో ఒక భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతున్నారు అంట…