మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. ఈ సంక్రాంతికి విడుదలైన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ భారీ పోటీ మధ్య పండుగ సీజన్‌ను పూర్తిగా డామినేట్ చేస్తూ సంచలన విజయాన్ని సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తొలి వారంలోనే పలు రికార్డులను బద్దలు కొట్టి, 2026లో తొలి అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఈ ఘన విజయంలో మునిగిపోతూనే చిరంజీవి ఎక్కువ విరామం తీసుకోకుండా తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. ఆయన తదుపరి చిత్రం ‘మెగా 158’, దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇది వీరిద్దరి రెండో సినిమా కావడం విశేషం. వీరి కాంబినేషన్‌లో 2023 సంక్రాంతికి వచ్చిన ‘వాల్తేర్ వీరయ్య’ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ అన్‌టైటిల్డ్ చిత్రానికి సంబంధించిన official లాంచ్ ఈ నెల చివరి వారంలో జరగనుంది. అదే సమయంలో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి చిరంజీవికి అదృష్టాన్ని తీసుకువస్తున్న నేపథ్యంలో ‘వాల్తేర్ వీరయ్య’, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ లాంటి హిట్ల తర్వాత ‘మెగా 158’ ను కూడా వచ్చే ఏడాది సంక్రాంతికే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను గత ఏడాది చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ‘The Blade that set the bloody benchmark” అనే క్యాప్షన్ సినిమాపై భారీ బజ్‌ను క్రియేట్ చేసింది.
‘మెగా 158’ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట నారాయణ, లోహిత్ ఎన్‌కే నిర్మిస్తున్నారు. ఇది వీరి తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.