HANU-MAN సినిమా తో టాలీవుడ్ సినీప్రపంచంలో సంచలనం సృష్టించిన తేజ సజ్జా, ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సారి కూడా అతని సినిమా ఒక సూపర్ హీరో సబ్జెక్టు… ఇంకా పెద్దది… ఇంకా ఉత్కంఠభరితమైనది. కార్తిక్ గట్టమనేని దర్శకత్వంలో రూపొందిన మిరాయి, యాక్షన్–అడ్వెంచర్ ఫాంటసీ శైలిలో ఉంది. పురాణ గాథలు, ఆధునికత, సాంకేతిక అద్భుతాలతో ఒక కొత్త ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తుంది. విడుదలకు ముందే ట్రైలర్ తో ఆసక్తి రేపిన ఈ సినిమా, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చింది. మరి మిరై ఎంత మాయ చూపించింది అని తెలుసుకుందామా:
కథలోకి వస్తే: శతాబ్దాల క్రితం, కలింగ యుద్ధం రక్తపాతం చూసి విచలితమైన అశోక చక్రవర్తి, అమరత్వ రహస్యాన్ని తొమ్మిది పవిత్ర గ్రంథాల్లో మూసివేసి, విశ్వసనీయులైన గార్డియన్లకు అప్పగిస్తాడు. కాలచక్రం తిరుగుతుంది. 2000వ సంవత్సరంలో శ్రియ, తొమ్మిదో గ్రంథానికి రక్షకురాలు, భవిష్యత్ పై దృష్టి కలిగిన స్త్రీ. ఆమెకు ఒక ఘోరమైన దృశ్యం కనబడుతుంది – మహాబీర్ లామా అనే దుష్టుడు – మంచు మనోజ్, ది బ్లాక్ స్వోర్డ్, ఈ గ్రంథాలన్నిటినీ స్వాధీనం చేసుకొని అమరత్వాన్ని పొంది ప్రపంచాన్ని పాలించాలని చూస్తున్నాడు. కొన్ని గ్రంథాలను చేజిక్కించుకున్న అతని దుష్టయాత్ర కొనసాగుతుంది.
ఐతే అతన్ని ఎదురుకోవడానికి అంబిక తీసుకున్న కీలక నిర్ణయం, హైదరాబాద్ వీధుల్లో నిర్లక్ష్యంగా తిరిగే ఒక అనాథ, వేదప్రజాపతి – తేజ సజ్జా జీవనయాత్రని ఆ గ్రంథాల వారసత్వంతో కట్టి వేస్తుంది. ఇక ప్రశ్నలు మొదలవుతాయి – సాధారణమైన వేద, మహాబీర్‌ని అడ్డుకోగలడా? ఆ గ్రంథాల్లో నిజంగా ఉన్న శక్తి ఏమిటి? మహాబీర్ ఎందుకు అమరత్వం కోసం ఈ పీడకలతో పరుగెడుతున్నాడు? రితికా నాయక్ ఎవరు? ఆమెకి ఈ రహస్యంతో సంబంధం ఏంటి? ముఖ్యంగా – మిరాయి అంటే గ్రంథమా? లేక దానికంటే గొప్పదా? సమాధానాలన్నీ సినిమా చుస్తే తెలుస్తుంది…
ఇక హనుమాన్‌తో తన శక్తిని నిరూపించిన తేజ సజ్జా, మిరాయి లో మరింత ఉన్నత స్థాయికి ఎదిగాడు. మొదటి భాగంలో నిర్లక్ష్యంగా తిరిగే యువకుడిగా ఆకట్టుకుంటే, రెండో భాగంలో తన విధిని గ్రహించి శక్తివంతుడిగా మారే సన్నివేశాలు నిజంగా గడ్డకట్టేలా చేస్తాయి. ఇది అతని కెరీర్‌లో ఒక అత్యుత్తమ ప్రదర్శనగా చెప్పుకోవచ్చు.
విలన్ పాత్రలో మంచు మనోజ్ అద్భుతం. ఆయన కళ్లు, స్వరం, డైలాగ్ డెలివరీ – అన్నీ కలిపి బ్లాక్ స్వోర్డ్కి జీవం పోశాయి. తెరపై ఆయన కనిపించే ప్రతిసారీ ఒక గంభీరత, భయం పుట్టేలా ఉంది.
మొత్తానికి సినిమా పాజిటివ్ ఎలిమెంట్స్ విషయానికి వస్తే, కథ ప్రాణం అని చెప్పాలి… అలాగే తేజ సజ్జ, మంచు మనోజ్, శ్రియ శరన్ ఇంకా హీరోయిన్ రితిక కూడా సూపర్ గా చేసారు. ఎవరి పాత్రల్లో వాళ్ళు ఒదిగిపోయారు.
ఇక అందుకే మాకు సినిమా తెగ నచ్చేసింది… అందుకే సినిమా పక్క గా థియేటర్ లో చూడాల్సిందే అని మేము రికమండ్ చేస్తున్నాం!
మా రేటింగ్: 3/5…